అరియానాతో సోహెల్ గొడవ.. అతను అరుస్తుంటే ఈమె నవ్వుతుంది..!

shami
బిగ్ బాస్ సీజన్ 4లో సోహెల్ అరియానా ఇద్దరు మంచి స్నేహితులుగా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే మధ్యలో సోహెల్ వేరే గ్యాంగ్ లో చేరాడు. అరియానా తన ఫ్రెండ్ అయినా సరే ఆమె అంటే పడనట్టుగానే ఉంటాడు సోహెల్. హౌజ్ లో వీరిద్దరి గొడవ చాలా కామన్. టామ్ అండ్ జెర్రీ లానే ఇద్దరు ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు. ఇదిలాఉంటే ఈరోజు ఎపిసోడ్ లో అరియానాతో సోహెల్ గొడవ వెరైటీగా సాగింది.

కెప్టెన్ గా అరియానా హౌజ్ మేట్స్ పడుకుంటే కుక్క అరిస్తే మాత్రం పనిష్మెంట్ ఉంటుంది. సోహెల్ అలా ఓ కునుకువేయగా అరియానా వచ్చి పనిష్ మెంట్ ఇస్తుంది. దానికి సోహెల్ సీరియస్ అయ్యాడు. ఇక నామినేషన్ ప్రక్రియలో కూడా అరియానా సోహెల్ ను నామినేట్ చేసింది. గుడ్డు పగలగొట్టే క్రమంలో అతన్ని తల మీద రుద్దడంతో సీరియస్ అయ్యాడు సోహెల్. సోహెల్ అరుస్తున్నా సరే అరియానా మాత్రం అతని మాటలు విని విననట్టు ఉండి నవ్వుతుంది.

మొత్తానికి సోహెల్ తిడుతున్నా సరే అరియానా మాత్రం నవ్వుతూ తన ఆట ఆడుతుంది. ఈ వారం కెప్టెన్ అయిన కారణంగా అరియానా నామినేషన్స్ లో లేదు. గత ఐదు వారాలుగా అరియానా వరుసగా నామినేట్ అవుతూ వచ్చింది. ఇక నెక్స్ట్ వీక్ అమ్మా రాజశేఖర్ డైరెక్ట్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. మొత్తానికి హౌజ్ లో ఈ వారం నామినేషన్స్ రచ్చ బాగానే ఉండేలా ఉంది.                                                              


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: