త్రివిక్రమ్ సైడ్ బిజినెస్.. చేతినిండా డబ్బే..
ఆర్ఆర్ఆర్ అయిపోతేనే ఎన్టీఆర్ ఖాళీ అవుతారు. అప్పుడే ఆయనకోసం సిద్దం చేసిన కథ పట్టాలెక్కుతుంది. ఈలోగా మరో సినిమా చేయలేరు, ఇంకో హీరోకి కమిట్ మెంట్ ఇవ్వలేని సందిగ్ధంలో పడిపోయారు త్రివిక్రమ్. ఇచ్చిన మాట ప్రకారం లేటయినా ఎన్టీఆర్ తోటే సినిమా చేయాలనుకుంటున్నారు. అయితే ఈలోగా త్రివిక్రమ్ తనకి చేతనైన పనితో బిజీగా ఉండబోతున్నారని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ చేయబోతున్న అయ్యప్పన్ కోషియమ్ రీమ్ కి త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేయబోతున్నారట. అంటే ఆ సినిమాకోసం త్రివిక్రమ్ పరోక్షంగా పనిచేస్తారు. కేవలం పవన్ కల్యాణ్ కోసమే ఈ పని చేస్తున్నారని, ఇందులో వేరే ఉద్దేశమేనీ త్రివిక్రమ్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే త్రివిక్రమ్ రామ్ సినిమాకి కూడా ఇలాగే తన సహాయం అందించబోతున్నట్టు తెలుస్తోంది. హీరో రామ్ ఓ మాంచి మాస్ ఎంటర్టైనర్ కావాలని త్రివిక్రమ్ ని అడిగారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు సినిమా చేయలేనని ఆయన చెప్పారట. అయితే రామ్ మాత్రం వెనక్కి తగ్గలేదు, కనీసం కథ అయినా ఇవ్వండి గురూజీ అని బలవంత పెట్టారట. దీంతో త్రివిక్రమ్ కథ రాసే పనిలో పడ్డారట. 10కోట్ల రూపాయల హాట్ డీల్ తో త్రివిక్రమ్ ఈ కథ రాస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం కథ ఇచ్చి సరిపెట్టకుండా దర్శకత్వం పర్యవేక్షణ కూడా చేసి పెడతానని మాటిచ్చారట. దీంతో రామ్ కొత్త దర్శకుడిని వెదికే పనిలో పడ్డారు. తమ సొంత బ్యానర్లోనే ఈ సినిమా తీయబోతున్నారట రామ్.