సేమ్ బాహుబలి సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న రాజమౌళి...
‘బాహుబలి’ ని తీసుకుంటే… నిజ జీవితంలో రానా కంటే ప్రభాస్ వయసులో పెద్దవాడు. అయితే ఆ సినిమాలో పాత్రలను బట్టి రానా ను పెద్ద వాడిగా… ప్రభాస్ ను చిన్నవాడిగా చూపించాడు మన జక్కన్న. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో కూడా అంతే..! నిజానికి చరణ్ కంటే ఎన్టీఆర్ వయసులో పెద్ద. అయినప్పటికీ ‘ఆర్.ఆర్.ఆర్’ లో చరణ్ .. ఎన్టీఆర్ ను తమ్ముడు అని పిలవడం.. అలాగే ఎన్టీఆర్ చరణ్ అన్న అని పిలవడం…
మనం టీజర్లలో చూసాము. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ అనేది అల్లూరి సీతారామ రాజు అలాగే కొమరం భీమ్ ల జీవితాలను అనుసరించి తీస్తున్న సినిమా కాబట్టి… నిజ జీవితంలో కొమరం భీమ్ కంటే అల్లూరి సీతారామ రాజు వయసులో పెద్ద కాబట్టి.. రాజమౌళి ఆ విధంగా ఫాలో అయ్యి ఉండొచ్చు.