అమీర్ ఖాన్ పై కేసు పెట్టిన ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా..?
ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు సినిమా షూటింగు సమయంలో కరోనా నిబంధనలు పాటించడం లేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ఇదే విషయంపై ఇటీవలే ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం గమనార్హం. ఇటీవలే అమీర్ ఖాన్ తన కొత్త సినిమా షూటింగుకు సంబంధించి చిత్రీకరణలో పాల్గొన్న విషయం తెలిసిందే. షూటింగ్ లో పాల్గొన్న సమయంలో అమీర్ ఖాన్ ఎలాంటి కరోనా నిబంధనలు పాటించలేదు అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పై మరోసారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కరోనా నిబంధనలను ఉల్లంఘించారని.. ఎపిడెమిక్ యాక్ట్ నిబంధనలను బ్రేక్ చేశారు అని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్లోని ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ అమీర్ ఖాన్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవలే షూటింగ్ కోసం వచ్చిన అమీర్ ఖాన్ కనీసం కరోనా నిబంధనలు పాటించకుండా అభిమానులతో ఫోటోలు దిగడం లాంటివి చేశారని.. అంతేకాకుండా ఎక్కడ భౌతిక దూరం కూడా పాటించలేదు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన. కాగా అమీర్ ఖాన్ పై ఎమ్మెల్యే కేసు నమోదు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.