చెర్రీ దెబ్బకు హాస్పిటల్ లో చేరిన  కృష్ణ వంశీ !

frame చెర్రీ దెబ్బకు హాస్పిటల్ లో చేరిన కృష్ణ వంశీ !

Seetha Sailaja
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ‘గోవిందుడు అందరి వాడే’ సినిమాకు ఏదో ఒక కష్టo చుట్టుముడుతూనే ఉంది. ఈమధ్య కాలంలో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు నచ్చక పోవడంతో చిరంజీవి ఒత్తిడితో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయబోతున్నారు అన్న విషయం తెలిసిందే. దీనికోసం ఈసినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న తమిళ నటుడు రాజ్ కిరణ్ ను తీసివేసి ప్రకాష్ రాజ్ ను పెట్టుకున్నారు.  అయితే లేటెస్ట్ గా కృష్ణ వంశీ రామ్ చరణ్ పై చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు మళ్ళీ చిరంజీవి చూసాడట. కృష్ణవంశీ తన సినిమాల పద్దతిలో చరణ్ పై కొన్ని క్లోజప్ షాట్స్ ఎక్కువగా తీయడంతో రామ్ చరణ్ ముఖ కవళికలకు అన్ని క్లోజప్ షాట్స్ మంచివి కావు అని చిరంజీవి అనడంతో ఎంతో కష్టపడి తీసిన ఈ క్లోజప్ షాట్స్ కూడ వృధా కావడంతో మళ్ళీ ఇవన్నీ కష్టపడి తీయాలా అని అంటూ దర్శకుడు కృష్ణ వంశీకి బెంగ పెట్టుకుని బీపి పెరిగి అపోలో హాస్పటల్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ రీ షూటింగ్స్ వల్ల నిర్మాత బండ్ల గణేష్ కు దాదాపు 10 కోట్ల వరకు అదనపు భారం పడుతుంది అనే వార్తలు కూడ వినపడుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ డేట్ ను ప్రకటించుకున్న ఈ సినిమాకు  ఈ సినిమా కష్టాలు ఏమిటి అని ఫిలింనగర్ లో సెటైర్లు వినపడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More