ఫుల్ కన్ ఫ్యూజన్ లో మెగా తనయుడు..!

NAGARJUNA NAKKA
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. తర్వాత ఏం చేయాలో చేయాలో  తేల్చుకోలేకపోతున్నాడు. ఎలాంటి స్టెప్‌ తీసుకుంటే ఎలాంటి రిజల్ట్‌ వస్తుంది.. ఏం చేస్తే బెటర్‌గా ఉంటుందనే డైలామాలోనే ఉండిపోయాడు. మరి టాలీవుడ్‌ టాప్‌ రేస్‌లో ఉన్న చరణ్‌కి వచ్చిన ప్రాబ్లమ్‌ ఏంటనే కదా డౌట్.

రామ్ చరణ్‌ మోస్ట్‌ అవైటడ్ మూవీ 'ట్రిపుల్ ఆర్'. జూ.ఎన్టీఆర్, చరణ్‌ కలిసి నటిస్తోన్న ఈ మల్టీస్టారర్‌పై బోల్డన్ని అంచనాలున్నాయి. రీసెంట్‌గానే ఈ మూవీ మళ్లీ సెట్స్‌కి వెళ్లింది. వచ్చే ఏడాది కల్లా షూటింగ్‌ పూర్తి చెయ్యాలని టార్గెట్‌ పెట్టుకున్నాడు రాజమౌళి. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌ తర్వాత ఎలాంటి సినిమా చెయ్యాలనేది మాత్రం తేల్చుకోలేకపోతున్నాడట చరణ్.

రామ్ చరణ్ 'ట్రిపుల్‌ ఆర్' తర్వాత 'ఆచార్య'లో ఒక స్పెషల్‌ రోల్ ప్లే చేయబోతున్నాడు. అయితే ఈ స్పెషల్‌ రోల్‌ తప్ప మరో మూవీకి సైన్ చేయలేదు రామ్ చరణ్. మరి 'ట్రిపుల్‌ ఆర్'లో మరో హీరో జూ.ఎన్టీఆర్ వరుసగా త్రివిక్రమ్, 'కె.జి.ఎఫ్.' ఫేమ్ ప్రశాంత్ నీల్‌ సినిమాలకి కమిట్ అయితే, చరణ్‌ ఎందుకు స్లో అయ్యాడు అంటే కన్‌ఫ్యూజనే కారణమంటున్నారు సినీజనాలు.

రామ్ చరణ్‌కి రీసెంట్‌గానే వంశీ పైడిపల్లి, సందీప్ వంగా, వెంకీ కుడుముల లాంటి దర్శకులు స్టోరీస్‌ నెరేట్‌ చేశారని ప్రచారం జరిగింది. కానీ చరణ్‌ వీళ్లలో ఒక్కరికి కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వలేదట. అంతకుమించిన స్టోరీస్‌ కావాలని, 'ట్రిపుల్‌ ఆర్‌' బజ్‌ ని కంటిన్యూ చేసే కథలు కావాలని వెతుకుతున్నాడట. మరి చెర్రీ ఆలోచనలకి తగ్గ స్టోరీస్‌ ఎప్పుడు దొరుకుతాయి, ఎలాంటి సినిమా చేస్తాడు, ఏ డైరెక్టర్‌ని ఓకే చేస్తాడు అనేది చూడాలి. మొత్తానికి రామ్ చరణ్ ఫుల్ కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు. తర్వాత ఏంటి.. తర్వాత ఏంటి అనే ప్రశ్న ఆయనలో తలెత్తుతోంది. చూద్దాం.. రామ్ చరణ్ రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.









మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: