ఆ కంటెస్టెంట్ కి అదే పెద్ద మైనస్...?
ఆయన దాన్ని చాలా బాహాటంగానే చూపిస్తారు. ఆయన కోపం మీద నాగార్జున ఈ వారం క్లాస్ తీసుకున్నాక తగ్గినట్లుగా కనిపిస్తూనే ఆయన తన కోపాన్ని మాత్రం ఎక్కడా అణచుకోలేకపోతున్నారు. ఆయన గత మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు కంటెస్టెంట్లతో కోపం కారణంగానే గొడవ పడ్డారు. అరియానా, అవినాష్ లతో సోయెల్ కి జరిగిన గొడవ ఏంటి అన్నది పక్కన పెడితే ఆయన తన కోపాన్ని ప్రదర్శించే తీరును చూసిన వారు బాబోయ్ అనుకునేలా ఉంది.
మొత్తానికి హౌజ్ లో అంతా కలసి సోహెల్ కోపానికి పరీక్ష పెడుతున్నారా అన్న చర్చ కూడా ఉంది. ఆయన కెప్టెన్ గా ఉన్నాడు. అలాగే సంచాలక్ గా కూడా ఉన్నాడు. దాంతో కొన్ని బాధ్యతలు తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ఆయన పని తీరు మీద ఎవరైనా కామెంట్స్ చేస్తే సోహెల్ తన వాదనను వినిపించవచ్చు కానీ ఎందుకో బాగా గట్టిగానే రియాక్ట్ అవుతున్నాడు. ఈ విషయంలో సోహెల్ తన తీరు మార్చుకోవాలై సాటి కంటెస్టెంట్లు అభిజిత్, అఖిల్ చెప్పి చూసినా కూడా ఆయన మారలేకపోతున్నారు. టాస్కులు ఇచ్చినపుడు బాగా ఆడే సోహెల్ లో మంచి డాన్సెర్ కూడా ఉన్నాడు. అలాగే మంచి జోష్ తో ఉంటే బాగుంటాడు. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల అది ఆయనకు అతి పెద్ద మైనస్ అవుతుందా అని ఆడియన్స్ అంటున్నారు.