దర్శకులను గుడ్డిగా నమ్మి దారుణంగా మోసపోతున్న ఆ స్టార్ హీరో

Suma Kallamadi
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మినిమమ్ గ్యారంటీ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నారు నాని. అతడితో ఏ నిర్మాత అయినా ఎటువంటి భయం లేకుండా సినిమా తెరకెక్కించ గలరు. నిన్ను కోరి, నేను లోకల్, మజ్ను, జెంటిల్మెన్, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి మంచి కథాబలం ఉన్న సినిమాలను హీరో నాని చేశారు. కానీ గత కొంతకాలంగా అతను పాపులర్ దర్శకులను గుడ్డిగా నమ్ముతూ డిజాస్టర్ సినిమాలను చవిచూస్తున్నారు. కృష్ణార్జున యుద్ధం, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలతో పాటు ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైన నాని 'వి' సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. దీంతో హీరో నాని సినిమా కెరీర్ ఒక్కసారిగా గాడి తప్పింది.

నిజానికి ప్రేక్షకుల నుండి విమర్శలు రావడం కారణంగానే అతను ప్రయోగాత్మక సినిమాల్లో నటించాలని నిశ్చయించుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తున్నారు. కానీ మంచి సినిమా కథను ఎంచుకోలేక దర్శకులని గుడ్డిగా నమ్మేసి తప్పటడుగులు వేస్తున్నారు హీరో నాని. ఫలితంగా డిజాస్టర్ సినిమాలు తన ఖాతాలో పేరుకుపోతున్నాయి. అదృష్టవశాత్తు 'వి' సినిమా డిజిటల్ రిలీజ్ అయింది కానీ అదే ఒకవేళ థియేటర్లలో రిలీజ్ అయినట్టయితే నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలు వాటిల్లేవి. జెంటిల్మెన్ వంటి రసవత్తరమైన త్రిల్లర్ మూవీని తెరకెక్కించిన ఇంద్రగంటి మోహన కృష్ణ ఈసారి హీరో నాని తో కలిసి మంచి హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు ప్రసాదిస్తారని అందరూ భావించారు కానీ ఆయన చెత్త సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అందరి ఆశలపై నీళ్లు చల్లారు.

సుధీర్ బాబు, నాని మల్టి స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా థామస్ నటించారు. అయితే సుధీర్ బాబు కి ఈ సినిమా ద్వారా కాస్త పాపులారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే సినిమా ప్రొడక్షన్స్ వాల్యూ బాగుంది అని దిల్ రాజుని మెచ్చుకున్నారు. ఇక ఈ రెండు అంశాలు తప్ప సినిమా గురించి పెద్దగా చెప్పుకోదగిన విషయాలే లేవు. మరి ఇటువంటి సినిమాకి హీరో నాని ఎలా ఓకే చెప్పారన్న సందేహం అందరిలో రాకమానదు. నిజంగానే హీరో నాని దర్శకులను గుడ్డిగా నమ్మి సినిమా కథలను వినకుండానే ఓకే చేస్తున్నారేమో. ఏదేమైనా భవిష్యత్తులో సినిమా కథలను ఒకటికి రెండు సార్లు విని ఆ తర్వాతనే ఓకే చెప్తే బాగుంటుందని అభిమానులు నానికి సోషల్ మీడియా వేదికగా సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: