విజయ్ దేవరకొండపై ఆసక్తికర టాక్.. ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు పండగే..?

praveen
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న విషయం తెలిసిందే. ఎంతో నాచురల్ కామెడీ తో యూత్ లో ఒక మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత ఏకంగా అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ మూవీలో నటించిన విజయ్ దేవరకొండ ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగి పోయాడు. అర్జున్ రెడ్డి సినిమాకు ముందు ఎంత కష్టపడినప్పటికీ అర్జున్ రెడ్డి సినిమా మాత్రం విజయ్ దేవరకొండను  ఓవర్ నైట్ స్టార్ హీరోను చేసింది అని చెప్పాలి. కేవలం సినిమాలలోనే కాదు తన మాటలతో తన ఆటిట్యూడ్తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ.




 అయితే గతంలో వరుస విజయాలతో  యూత్ ఐకాన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ ఈ మధ్య కాలంలో మాత్రం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. మరో భారీ హిట్టు కొట్టేందుకు ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పని చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న  సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా టైటిల్ ఫైటర్ అని ఉండటంతో విజయ్ దేవరకొండ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.



 అంతేకాకుండా పూరి సినిమాలో  ముక్కుసూటిగా మాట్లాడినట్టుగా ఉంటాయి అన్ని  డైలాగ్ లు  దానికితోడు విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్  తోడైతే ఎలా ఉండబోతుంది అని ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక టాక్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ లుక్ తో అందరిని ఆశ్చర్యపరిచనున్నాడు అన్న టాక్ వినిపిస్తోంది. ఫైటర్ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే ఒకే ఒక్క ఫైట్ సీన్ కోసం ఏకంగా ఎనిమిది నెలల నుంచి సిక్స్ ప్యాక్ చేయడానికి కసరత్తులు చేస్తున్నాడట రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఒకవేళ ఇది నిజమే అయితే ఫ్యాన్స్ అందరికీ పండగే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: