జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్.... హీరో ఎవరో తెలుసా...?

Suma Kallamadi
జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చి ఎన్నో ఏళ్ళు అయిపోయిన అది మాత్రం ఇంకా గుర్తుండి పోయింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎప్పటికీ మరచిపో లేని సినిమాల్లో  జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటి అనే చెప్పాలి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిరు -  శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం సోషియో ఫాంటసీల్లో ఇదే క్లాసిక్ అని చెప్పచ్చు. ఇవన్నీ ఇలా ఉండగా   ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని గత కొంత కాలంగా దర్శకేంద్రుడు ప్లాన్ చేస్తూనే ఉన్నారట కానీ కుదరడం లేదు.ఇప్పుడు మాత్రం మళ్ళీ ఈ చిత్రానికి  సీక్వెల్ తీయాలనే ఆలోచన ప్రారంభం అయ్యింది.

నిజంగా ఈ సినిమా కనుక వస్తే ఎవరిని హీరోగా పెట్టొచ్చు.... ఈ విషయం లోకి వస్తే..... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా చేస్తే బాగుంటుందని అశ్వనీ దత్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అని అన్నారు. కానీ సరిగ్గా  కథ సెట్ కాలేదు కనుకే ఇంకా సినిమా ప్రారంభం కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం  స్టోరీ సెట్ అయ్యిందని టాక్. చిరు తనయుడు , రాఘవేంద్ర రావు తనయుడు కలిస్తే మంచి ఆలోచనే. అలానే  శ్రీదేవి తనయని కూడా ఈ ప్రాజెక్టు లో ఇన్‌వాల్వ్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. కానీ రాఘవేంద్రరావు తనయుడుకి సక్సస్ లు లేవు.

అశ్వనీదత్ - రాఘవేంద్రరావు మధ్య ఈ సీక్వెల్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మరి కధ కుదిరిన ఇంకా ఏమి ఫైనల్ అవ్వ లేదు. అయితే ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించరు అనేది స్పష్టం అయిపోయింది. ఆయన కేవలం  దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తారని సమాచారం. రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్‌కి దర్శకత్వ బాధ్యత అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: