15 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతున్న కాంబో.. బాక్సులు బద్ధలవ్వాలంతే..!

shami
టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. ఊర మాస్ సినిమాలకు పెట్టింది పేరుగా బోయపాటి శ్రీను క్రేజ్ అందరికి తెలిసిందే. హీరో ఇమేజ్ రెండింతలు చేసేలా ఆయన సినిమాలు ఉంటాయి. భద్రతో మొదలైన బోయపాటి సినిమా డైరక్షన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించాడు. ఇక ప్రస్తుతం బాలయ్య బాబుతో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నాడు బోయపాటి శ్రీను.

ఈ సినిమాలో బాలకృష్ణను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేస్తాడని టాక్. బోయపాటి శ్రీనుని డైరక్టర్ గా ఇంట్రడ్యూస్ చేసింది దిల్ రాజే. భద్ర సినిమా ఆయన డైరక్షన్ లోనే వచ్చింది. అల్లు అర్జున్ కోసం అనుకున్న ఆ కథ బన్నీ ఎందుకో చేయనని చెప్పడంతో రవితేజకు వచ్చింది. మాస్ మహరాజ్ రవితేజ కెరియర్ లో భద్ర మంచి హిట్ సినిమాగా నిలిచింది.

ఇక భద్ర తర్వాత ఇన్నేళ్లకు మళ్ళీ బోయపాటి శ్రీను, దిల్ రాజు కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరో నటిస్తాడని తెలుస్తుంది. అసలైతే మహేష్, వంశీ పైడిపల్లి మూవీని ప్లాన్ చేశాడు దిల్ రాజు. అయితే మహేష్ మాత్రం ఎందుకో ఆ కాంబో రిజెక్ట్ చేశాడు. దిల్ రాజు బ్యానర్ లో బోయపాటి శ్రీను చేస్తున్న నెక్స్ట్ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది.                                                                                                    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: