లారెన్స్ లక్ష్మీ బాంబ్ బాలీవుడ్ లో విజయాన్ని ఇస్తుందా...?
హీరో అక్షయ్ కుమార్ తో లక్ష్మీ బాంబ్ అనే సినిమా తీసుకొచ్చాడు లారెన్స్. ఈ చిత్రం కాంచన సినిమాకి రీమేక్. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దీపావళికి తీసుకు రానున్నారు. అక్షయ్ కుమార్ కోపంతో ఎంత గానో ఆకట్టుకున్నాడు. నిజంగా దెయ్యాన్ని చూసిన రోజు.. నా చేతికి గాజులు వేసుకుంటా అని అంటాడు అక్షయ్. అలానే కాంచనలో మనం చూసిన షాపింగ్ మాల్ సీన్ ఇక్కడ అక్షయ్ బాగా చేసాడు. మాల్‌లో ఎర్ర రంగు చీర కట్టుకుని అక్షయ్ కుమార్ మాట్లాడే తీరు అద్భుతమనే చెప్పవచ్చు. ఇలా తెలుగులో లారెన్స్ మాదిరి గానే అక్షయ్ నటించాడు.
కానీ కాంచన కథలో స్వల్ప మార్పులు చేసినట్లు అర్ధం అవుతోంది. ఏది ఏమైనా అక్షయ్ ట్రైలర్ తో బాగా ఆకట్టుకున్నారు. మరి సినిమా ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ లక్ష్మీ బాంబ్ ట్రైలర్ మాత్రం వావ్ అనేలా ఉంది. తెలుగు, తమిళ్ లో సక్సస్ సాధించిన లారెన్స్ బాలీవుడ్ మూవీతో విజయం అందుకుంటాడా లేదా అనేది చూడాలి.