ప్లాప్ డైరెక్టర్ తో మళ్ళీ మూవీ చేయనున్న రాజ్ తరుణ్...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... యంగ్ హీరో రాజ్ తరుణ్ చాలా టాలెంటెడ్ హీరో. అయితే తనకు గత కొంత కాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తుంది. వరుస ప్లాపులతో సతమతమవుతూ ఉన్నాడు. స్టార్టింగ్ లో మూడు హిట్లు మినహా తరువాత అన్ని ప్లాపులే ఎదుర్కున్నాడు రాజ్ తరుణ్. ఇక ఈ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఒరేయ్ బుజ్జిగా’ ఈ మధ్యనే ఓటిటిలో విడుదలయ్యింది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ‘ఒక లైలా కోసం’ వంటి డీసెంట్ లవ్ స్టోరీలను అందించిన దర్శకుడు కొండా విజయ్ కుమారే.. ఈ చిత్రానికి దర్శకుడు. దాంతో కొద్దిపాటి అంచనాలు ఏర్పడ్డాయి.ఓటిటి నుండీ మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. ఎట్టకేలకు ‘ఆహా’ లో ఈ చిత్రం విడుదలయ్యింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయిందనే చెప్పాలి. కాని ఈ చిత్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రాజ్ తరుణ్. కాని ఈ సినిమా కూడా నిరాశపరిచింది.

ఫస్ట్ హాఫ్ కొంత వరకూ పర్వాలేదు అనిపించినా.. సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిందనే కామెంట్స్ వినిపించాయి. ఇదే చిత్రాన్ని థియేటర్లలో కనుక విడుదల చేసి ఉంటే బయ్యర్స్ కు భారీ నష్టాలు వాటిల్లేవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రీకరణ తుది దశలో ఉండగా.. ఆ చిత్రం దర్శకుడు కొండా విజయ్ కుమార్ తో మరో చిత్రం చెయ్యడానికి ఓకే చెప్పేశాడట హీరో రాజ్ తరుణ్.

ఓ ఎన్నారై నిర్మాత ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి ముందుకు వచ్చాడట. అంతేకాదు షూటింగ్ కూడా మొదలుపెట్టేసారు. అయితే ఇప్పుడు ‘ఒరేయ్ బుజ్జిగా’ ఫలితం తేడా కొట్టింది. దాంతో రాజ్ తరుణ్- కొండా విజయ్ కుమార్ ల కొత్త సినిమా నిర్మిస్తున్న నిర్మాత టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. ఇది కేవలం రాజ్ తరుణ్ తొందర పాటు వల్లే జరిగిందని అతను భావిస్తున్నట్టు కూడా ఇన్సైడ్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: