హోటల్ టాస్క్ అవినాష్ వల్లే అసలు గొడవ..!
వారివైపే ఉంటూ వారికి మస్కా కొట్టి హోటల్ సిబ్బందికి ఆ స్టార్స్ రాకుండా చేయాలని సీక్రెట్ టాస్క్. అయితే ఈ టాస్క్ లో భాగంగా అవినాష్ ఆగమాగం చేస్తున్నాడు. హోటల్ వారు చేసిన బిర్యానిలో పిన్ పెట్టడం.. కర్రీస్ లో ఉప్పు వేయడం లాంటివి చేశాడు అవినాష్. అయితే ఇదంతా హోటల్ సిబ్బంది కావాలని చేస్తున్నట్టు గెస్టులుగా వచ్చిన మెహబూబ్, సోహెల్ ఫీల్ అవుతున్నారు. హౌన్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టంట్స్ మొత్తం హోటల్ సిబ్బందిగా ఉండటంతో గెస్టులకు సపోర్ట్ లేకుండాపోయింది.
అయితే గెస్టులు హోటల్ సిబ్బంది ఇచ్చే సర్వీసులను బట్టి స్టార్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బజర్ మోగగానే స్టార్స్ తీసుకోవాల్సిన గెస్టులు అది మర్చిపోగా అవి తన దగ్గరే పెట్టుకుని మైండ్ గేం ఆడుతున్నాడు అభిజిత్. హారిక తనకు సంబందించిన ఒక స్టార్ మాత్రమే అభిజిత్ కు ఇవ్వగా ఆమె చేతిలోనే మిగతా స్టార్స్ పెట్టి అవన్ని తనే ఇచ్చిందన్నట్టుగా చెబుతున్నాడు అభిజిత్. ఈ విషయంపై అభిజిత్ మీద హారిక సీరియస్ గా ఉంది.