హౌజ్ మేట్స్ అసలు రంగు బయటపెట్టిన స్వాతి దీక్షిత్

shami
బిగ్ బాస్ సీజన్ 4 నుండి నాలుగవ వారం హౌజ్ నుండి బయటకు వచ్చింది స్వాతి దీక్షిత్. అనూహ్యంగా ఆమె వారానికే వెనుతిరిగింది. ఇది ఎవరు ఊహించని రిజల్ట్. ఇక బయటకు రాగానే బిగ్ బాస్ వారు నిర్వహించే ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వాతి షాకింగ్ కామెంట్స్ చేసింది.

అఖిల్ ఫోకస్ అంతా మోనాల్ మీద ఉంది.. ఆమెను గుడ్డిగా నమ్మేస్తున్నడనిపించింది.. అతను మంచోడే కాని ఫోకస్ అంతా ఆమె మీద ఉంది. అది మార్చుకుంటే టాప్ లో ఉంటాడు. అమ్మా రాజశేఖర్ ఓ కంత్రీ అని అస్సలు నమ్మకూడదని అన్నారు స్వాతి దీక్షిత్. హారిక ఫోకస్ మొత్తం అభిజిత్ మీద ఉందని.. ఆమె అతని విషయంలో పొసెస్వి ఫీల్ అవుతుందని అన్నది

ఇక లాస్య గురించి చెబుతూ క్యూరియాసిటీ ఎక్కువ. అందరి గురించి ఆలోచిస్తూ అనవసరంగా ఇబ్బంది పడుతుందని అన్నారు. మోనాల్ మనుషుల ఫీలింగ్స్ తో ఆడుకుంటుందని.. అఖిల్, అభిజిత్ ల మధ్య చిచ్చు పెట్టేది తనే అని.. ఆట ఆడొచ్చు కాని వేరే వాళ్ల ఫీలింగ్స్ తో ఆడకూడదని చెప్పారు స్వాతి.

సోహేల్ గురించి అడగగానే ఐ హేట్ హిస్ యాటిట్యూడ్ అన్నారు. సుజాత నవ్వు ఒక ఫేక్ అని చెప్పేసింది స్వాతి. ఇలా హౌజ్ లో వారం రోజులే ఉన్నా అందరి అసలు రంగు చెప్పేసి షాక్ ఇచ్చింది స్వాతి. మరి నిజంగా స్వాతి చెప్పినట్టుగానే హౌజ్ లో ఉన్న సభ్యులు ఆడుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది.                                                                          


 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: