దర్శకుడితో రాజీ పడిన మహానటి

Prasad
తెలుగు వారికి చిరకాలం గుర్తుండే నటి సావిత్రి. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రిల కాంబినేషన్ లో అనేక సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వాటిలో సిరిసంపదలు సినిమా ఒకటి. మాస్టర్ వేణు అందించిన సంగీతం ఈ సిరిసంపదలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమాలోని ‘ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ’ అనే పాట సూపర్ హిట్ అయింది. కాగా, ఈ పాటను ఘంటసాల, జానకి పాడారు. అయితే, జానకి ని మార్చి సుశీలతో పాడించాలని సావిత్రి పట్టు పట్టింది. అయితే చిత్ర దర్శకుడు పి.పుల్లయ్య అందుకు అంగీకరించలేదు. అయినా సావిత్రి ఇంకా పట్టుపబడుతోండటంతో పుల్లయ్య గారికి కోపం వచ్చి ‘అవసరమైతే నాయిక పాత్రలో నిన్ను మారుస్తాను. కానీ, జానకిని మార్చేది లేదని’ ఖరాఖండీగా చెప్పారు. దీంతో దర్శకుడిని ఎదిరించలేక మహానటి సావిత్రి రాజీపడింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: