ఒక 'లవ్ స్టోరీ' పూర్తి చేసి.. మరో స్టొరీ కి సిద్ధమైన చైతూ..?

praveen
ప్రస్తుతం అక్కినేని వారసుడిగా నాగచైతన్యకు ఒక మంచి క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై నిలదొక్కుకున్న హీరో నాగచైతన్య. ప్రస్తుతం నాగచైతన్య ఫుల్ జోష్  తో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ మంచి విజయాలు అందుకుంటూ వస్తున్నాడు నాగచైతన్య. ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన... లవ్ స్టోరీ అనే సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సినిమాలో నాగచైతన్య కు జోడిగా సాయిపల్లవి నటించింది.



 ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులందరి  లో సరికొత్త ఆసక్తిని కలిగించింది. మామూలుగా శేఖర్ కమ్ముల సినిమాలు అంటేనే యూత్ ను  ఎక్కువగా ఆకర్షించే విధంగా ఉంటాయి అనే విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం నాగచైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఎలా ఉండబోతోందనే దాని పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అవగా.. కరోనా  వైరస్ నేపథ్యంలో కొంత మేర షూటింగ్ ఆగిపోయింది. ఇటీవల కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన నేపథ్యంలో శరవేగంగా మిగిలి వున్న కొంత భాగాన్ని షూటింగ్ పూర్తి చేసింది చిత్ర బృందం.



 అయితే ఇటీవలే లవ్ స్టోరీ సినిమాలు పూర్తి చేసిన నాగచైతన్య అదే స్పీడ్ ను  కొనసాగిస్తూ ఇప్పుడు మరో స్టోరీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో 'థాంక్యూ' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేయబోతున్నాడు నాగ చైతన్య. ఇక ఆ తర్వాత మోహన కృష్ణ ఇంద్రగంటి తో సినిమాకు.. ఆ తర్వాత యువ దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాగ చైతన్య. అంతేకాదు అభిలాష్ అనే కొత్త దర్శకుడితో కూడా నాగచైతన్య సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ టౌన్ లో టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: