ఈసారి బిగ్ బాస్ విజేత ఆమే.. దేవి నాగవల్లి కామెంట్స్..!
తను అసలు ఎలిమినేట్ అవుతానని అనుకోలేదని కాని ఆడియెన్స్ ఆమెను ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇక ఈ సీజన్ విన్నర్ గా ఎవరు నిలుస్తారని దేవిని రాహుల్ అడుగగా అరియానా అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పింది దేవి. అరియానా పక్కా గేమ్ ప్లాన్ తో హౌజ్ లోకి వచ్చిందని. ఆమె ఒక్కతే ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఆటని ఆటలా ఆడుతుందని విజేతగా నిలిచే స్టామినా అరియానాకు ఉందని అన్నారు దేవి నాగవల్లి.
హౌజ్ లోంచి వెళ్లేప్పుడు కూడా అరియానాని నామినేషన్స్ నుండి సేవ్ చేసిన దేవి ఆమె కొద్దిగా కష్టపడితే విజేత అయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది. మొదటి రెండు వారాలు స్క్రీన్ స్పేస్ లేకున్నా సరే నెట్టకొచ్చిన అరియానా ఈమధ్య టాస్కుల్లో తను ప్రత్యేకంగా కనిపిస్తుంది. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో అరియానాకు బాగా సపోర్ట్ ఇచ్చారు ఆడియెన్స్. అలానే కష్టపడితే మాత్రం ఆమెకు తిరుగు ఉండదని చెప్పొచ్చు. దేవి నాగవల్లి చెప్పినంత మాత్రానా అరియానా గెలుపు అంత ఈజీ కాదు. ఆమెను హౌజ్ లో కొందరు తక్కువ అంచనా వేస్తున్నారు. వారికి మాత్రం అరియానా షాక్ ఇస్తుందని మాత్రం తెలుస్తుంది.