కంగనాకు ఎందుకు సమన్లు పంపలేదు.. అధికారులను నిలదీసిన సీనియర్ హీరోయిన్..?

praveen
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సుశాంత్ కేసులో ఊహించని విధంగా తెర మీదికి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం ఎన్నో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ఏకంగా 25 మంది బాలీవుడ్ సినీ ప్రముఖుల పేర్లు  విచారణలో  సుశాంత్  ప్రియురాలు రియా చక్రవర్తి బయటపెట్టింది అంటూ వార్తలు హల్చల్ చేయడం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఇక తర్వాత దీనిపై స్పందించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తాము ఇప్పటివరకూ ఎవరికీ సమన్లు జారీ చేయలేదని స్పష్టం చేశారు. ఇక ఇటీవలే మరో నలుగురు ప్రముఖ హీరోయిన్ ల కు సమన్లు జారీ అయ్యాయి.



 ఏకంగా ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు ఉన్న హీరోయిన్ లుగా కొనసాగుతున్న దీపికా పదుకొనే,  సారా అలీ ఖాన్,  శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్ లకు  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుంచి సమన్లు అందడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక నలుగురు ప్రముఖ హీరోయిన్ లకు ఒకేసారి సమన్లు అందడంతో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల నటి నగ్మా ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.




 బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కి  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఎందుకు సమన్లు  పంపలేదు అంటూ ప్రశ్నించారు. గతంలో తాను డ్రగ్స్ తీసుకున్నట్లుగా కంగనా  అంగీకరించిందని... మరి కంగనాకు అధికారులు ఎందుకు సమన్లు  పంప లేదు అంటూ ప్రశ్నించారు. వాట్సాప్ చాట్ ఆధారంగానే మిగిలిన హీరోయిన్లను పిలిచారు కదా... మరి స్వయంగా వెల్లడించిన కంగనా ను  ఎందుకు పిలవలేదు అంటూ ప్రశ్నించారు. కేవలం టాప్ హీరోయిన్స్ సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమే ఎన్సిబి  యొక్క డ్యూటీయా అంటూ నిలదీశారు హీరోయిన్ నగ్మా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: