పవన్ పై అల్లరి నరేష్ సెటైర్లు !

Seetha Sailaja
ప్రస్తుతం రాజకీయ నాయకుల దగ్గరి నుంచి యంగ్ హీరోలవరకు పవన్ భజన చేయకుండా రోజుగడవని పరిస్థితి ఏర్పడింది. తమ సినిమాలకు కలెక్షన్స్ తెచ్చుకోవడానికి పవన్ ప్రస్తావన ఏదోవిధంగా తమ సినిమాలలో ఉండేటట్లుగా తమవంతు ప్రయత్నాలు నేటి చాలా మంది హీరోలు చేస్తున్నారు. గతంలో సుడిగాడి సినిమాలో చాలామంది టాప్ హీరోల సీన్స్ చేసి హిట్ అందుకున్న అల్లరి నరేష్ ఆ తరువాత వచ్చిన సినిమాలు అన్ని ఫ్లాప్ కావడంతో ఇక రాబోతున్న తన జంపుజిలాని విజయం అల్లరోడికి జీవన్మరణ సమస్య గా మారింది. దీనితో ఈ సినిమాలో కుడా మన అల్లరోడు తన సినిమా హిట్ కావడం కోసం పవన్ డైలాగ్ ల స్మరణ మొదలు పీట్టాడు. పవన్ అత్తారింటికి దారేది సినిమాలోని డైలాగ్స్ ను తన ‘జంపు జిలనీ’ కోసం వాడుకుంటున్నాడు ‘నేను సింహం లాంటోoడిని, దానికి నాకు ఒక్కటే తేడా నాకు దురద వేస్తే చేత్తో గోక్కుంటాను, దానికి దురద వేస్తే కాలితో గోక్కుంటుంది మిగిలినది అంతా సేమ్ టు సేమ్’ అంటూ పవన్ బాడీ లాంగ్వేజ్ ని అనుకరిస్తూ పవన్ డైలాగుల పై సెటైర్లు వేయడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని సూపర్ డైలాగు పై అల్లరి నరేష్ చేసే పేరడీ ఎంతవరకు జనానికి నచ్చుతుందో ‘జంపు జిలానీ’ వస్తే కాని తెలియదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: