పాపం .... 'క్రాక్' తో నైనా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో ......??
ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో భారీ ఖర్చుతో నిర్మించింది. అయితే ఆ సినిమా కూడా సక్సెస్ కాలేదు. ఇక గత ఏడాది విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన డిస్కోరాజా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ కు ఆ సినిమా కూడా ఘోరమైన పరాజయాన్ని అందించింది. దానితో వరుసగా నాలుగు పరాజయాలు చవిచూసిన రవితేజ, కెరీర్ పరంగా కొంత ఇబ్బందుల్లో పడ్డారనే చెప్పాలి. ఇక ప్రస్తుతం రవితేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా క్రాక్. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. గతంలో రవితేజతో డాన్ శ్రీను, బలుపు వంటి సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన గోపి, ఈ సినిమాతో కూడా సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనపడుతోందని అంటున్నారు. మరి ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ క్రాక్ సినిమాతో అయినా మాస్ రాజా సక్సెస్ ట్రాక్ లోకి వస్తారో లేదో చూడాలని అంటున్నారు పలువురు ప్రేక్షకులు ....!!