పండుని పెళ్ళి చేసుకుంటా అంటున్న శ్రీముఖి..!
సుమ యాంకర్ గా చేస్తున్న ఈ గేమ్ షోకి సినీ సెలబ్రిటీస్ వస్తుంటారు. లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో రాజీవ్ కనకాల, బ్రహ్మాజి, రాజా రవీంద్ర, సమీర్ వచ్చారు. ఇక ఈ వారం గెటప్ శ్రీను, శ్రీముఖి, విష్ణు ప్రియలతో పాటుగా ఢీ డ్యాన్సర్ పండు కూడా వచ్చాడు. ఢీలో చాలామంది డ్యాన్సర్ ఉన్నా జబర్దస్త్ గ్యాంగ్ తో కలిసి వారితో పాటే షోలో అదపాదడపా కనిపిస్తున్నాడు పండు. అందుకే ఈ బ్యాచ్ అందరికి పండు స్నేహితుడయ్యాడు.
ఈ క్రమంలో క్యాష్ ప్రోగ్రామ్ కు వచ్చిన పండుని పెళ్ళి చేసుకుంటా అన్నది శ్రీముఖి. షో ప్రోమోలో పండు, శ్రీముఖిల రొమాన్స్ అదిరింది. షోని రక్తి కట్టించడం కోసం శ్రీముఖి అలా పండుని వాడేసుకుందని చెప్పొచ్చు. చివరగా నక్కిలీసు గొలుసు సాంగ్ లో నువ్వు అమ్మాయి గెటప్ వేయకుండా ఉంటే కచ్చితంగా నిన్ను పెళ్ళి చేసుకునే దాన్ని అంటూ షాక్ ఇచ్చింది శ్రీముఖిల్. మొత్తానికి అలా క్యాష్ లో వీరి హంగామా సాగింది.