బిగ్ బాస్ 4 : హౌజ్ మెట్స్ అందరికి పనిష్మెంట్..!
అయితే శుక్రవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌజ్ మేట్స్ కు షాక్ ఇచ్చాడు. హౌజ్ లో ఏ ఒక్కరు ఇంటి నియమాలను పాటించడం లేదని వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చాడు. బిగ్ బాస్ తదుపరి ఆదేశం మేరకు గార్డెన్ ఏరియాలోకి వచ్చి గుంజీలు తీయమని చెప్పాడు. బిగ్ బాస్ ఇచ్చిన ఈ పనిష్మెంట్ కు హౌజ్ మేట్స్ షాక్ అయ్యారు. అంతేకాదు ఈ పనిష్మెంట్ ఇంకా కొనసాగుతుందని బిగ్ బాస్ చెప్పడంతో హౌజ్ మేట్స్ లో టెన్షన్ మొదలైంది.
ఈ వారం ఇంటి కెప్టెన్ గా లాస్య ఉన్నారు. శురవారం కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం ఎలాంటి టాస్క్ ఇస్తారో చూడాలి. కెప్టెన్ గా ఉండటం వల్ల నామినేషన్స్ నుండి వెసులుబాటు కలుగుతుంది. మరి ఈరోజు కెప్టెన్ గా ఎవరు ఎన్నుకోబడతారో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 4 మొదటి కెప్టెన్ గా లాస్య తన టాలెంట్ చూపించారు.
అంతేకాదు హౌజ్ లో గంగవ్వ ఆరోగ్యం పట్ల గురించి ఆందోళన మొదలైంది. గురువారం ఎపిసోడ్ లో హౌజ్ లో తాను ఉండలేకపోతున్నానని.. ఇంటికి వెళ్తానని గంగవ్వ అనడం హౌజ్ మేట్స్ కు షాక్ ఇచ్చింది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.