విజయ్ దేవరకొండ పేరు తో మోసం చేస్తున్న జాదుగాళ్ళు
ఇప్పటికే పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయం తో మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఇక విజయ్ తో తీస్తున్న మూవీ పై ఇటు ప్రేక్షకులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ పేరుతో కొంత మంది జాదూగాళ్ళు మోసాలకుపాల్పడుతున్నారు. కొంతమంది విజయ్ దేవరకొండ పేరు ఉపయోగించుకుని తప్పుడు ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని విజయ్ దేవరకొండ టీమ్ వెల్లడించింది. 'విజయ్ దేవరకొండతో సినిమా తీయబోతున్నామంటూ కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
ఆయన సినిమాకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నామంటూ.. నటీనటులను సంప్రదిస్తున్నాయి.అలాంటివారిని నమ్మవద్దని విజయ్ టీమ్ కోరింది. విజయ్ సినిమాకు సంబందించిన అప్డేట్స్ ను విజయ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలుపుతాడని అదేవిధంగా విజయ్ నటించబోతున్న ఏ ప్రాజెక్టైనా సరే నిర్మాతలు అధికారికంగా నేరుగా ప్రకటిస్తారు.అని క్లారిటీ ఇచ్చింది విజయ్ టీమ్.ఇక తన తాజా చిత్రం ఫైటర్ కి సంబంధించిన అన్నీ వివరాలను కూడా నేరుగా విజయ్ నే తన అధికారిక సోషల్ మీడియాలో తెలియజేస్తున్నట్లు వెల్లడించారు