సినిమా కోసం గుర్తు పట్టలేని విధంగా మారిన నాగ సౌర్య !

Purushottham Vinay
నాగ సౌర్య.. చందమామ కథలు సినిమాలో పెళ్ళైన  ఒక పేద యువకుడిగా నటించి మెప్పించాడు. ఇక ఆ తర్వాత ఊహలు గుస గుస లాడే చిత్రం లో ఫుల్ లెంగ్త్ హీరో గా లవర్ బాయ్ పాత్రలో నటించి ఎంతగానో ఆకట్టుకున్నాడు. చూడడానికి అందంగా, లవర్ బాయ్ ల కనిపించే నాగ సౌర్య ఒక్కసారిగా ఎంత రఫ్ గా అయ్యాడో చూడండి.
ఈ లాక్ డౌన్ టైంను బాగా ఉపయోగించుకున్న వారిలో యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నాగశౌర్య ముందుంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అవును.. లాక్ డౌన్ టైములో సినీ సెలబ్రిటీలు కూడా ఇళ్లల్లోనే ఉండడం వల్ల బరువు పెరిగినవారు కూడా ఉన్నారు. అయితే మన నాగశౌర్య మాత్రం తన తదుపరి సినిమా కోసం కఠోర శ్రమ చేసి సిక్స్ ప్యాక్ బాడీని డెవలప్ చేశాడు. ఓ ట్రైనర్ ను పెట్టుకుని వర్కౌట్లు చేస్తున్న వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వచ్చిన నాగ శౌర్య.. ఇప్పుడు ఆ టాస్క్ ను కంప్లీట్ చేసి సినిమాకి రెడీ అంటూ హింట్ ఇచ్చాడు.
ప్రస్తుతం తన జిమ్ ట్రైనర్ తో సిక్స్ ప్యాక్ చూపిస్తూ ఉన్న సెల్ఫీ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.’వాట్ ఏ డెడికేషన్’ అంటూ నాగశౌర్య పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ‘శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి’, ‘నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించబోతున్న స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నాడు నాగ శౌర్య. ఇది అతనికి 20వ చిత్రం. సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి కొడుకు కాలభైరవ సంగీతం అందించబోతున్నాడు.
ఈ చిత్రంలో నాగశౌర్య ‘ఆర్చర్’గా కనిపించబోతున్నట్టు సమాచారం.విలన్ గా జగపతి బాబు నటిస్తున్నాడు. 6 అడుగుల హైట్ కలిగిన నాగశౌర్య మొన్నటి వరకూ క్లాస్ సినిమాలనే చేస్తూ వచ్చాడు. అయితే ‘ఛలో’ దగ్గరనుండీ తన కటౌట్ కు తగినట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ కలిగిన సినిమాలను కూడా చెయ్యడం మొదలుపెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: