గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై సంచలన కామెంట్లు చేసిన మెగా బ్రదర్..వైరల్

Satvika
తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరందుకుంది.. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన అకుంఠిత కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్..  ఆరోగ్యవంత మైన తెలంగాణను నిర్మించే పనిలో ఈ గ్రీన్ ఇండియా ను ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఛాలెంజ్ ను తీసుకొని చాలా మంది ప్రముఖులు మొక్కలను నాటారు.. అలాగే తోటి వారిని మొక్కలను నాటాలని ఛాలెంజ్ ను విసిరారు.


ముఖ్యంగా ఈ ఛాలెంజ్ సినీ ఇండస్ట్రీ లో ట్రెండ్ అయ్యింది. ఒక్కొక్కరు స్వతహాగా ముందుకు రావడం .. మొక్కలను నాటడం ఛాలెంజ్ ను నచ్చిన వారికి విసరడం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా కమెడియన్ చంద్ర విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన మెగా బ్రదర్ నాగబాబు మణికొండ లోని తన నివాసం లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం లో భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మొదలు పెట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు టీవీ ఆర్టిస్టు భరణి, కల్కీ రాజాకు ఈ ఛాలెంజ్ ను విసిరారు.


ఇకపోతే బాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని మేము 20 ఏళ్ల క్రితమే చేసాము.. ఎకో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ కూడా ఉందని చెప్పారు. అలాగే, మెగా ఫ్యాన్స్ ‌తో కలిసి పలు చోట్ల 10వేల మొక్కలకు పైగా నాటించామని వెల్లడించారు. హైదరాబాద్‌ లోని వనస్థలిపురం లో మొక్కలను కూడా నాటామని అన్నారు. అలాగే జీడిమెట్లలో 14 ఎకరాలను తీసుకొని 14 వేల మొక్కలు వరకు నాటి దగ్గరుండి పెంచానన్నారు. అది కెమికల్ డంపింగ్ యార్డ్ కావడంతో శుభ్రంగా మట్టిపోయించి మొక్కలు నాటామన్నారు. ఇప్పటివరకు 20 వేల మొక్కలను నాటడం జరిగింది.. 50 వేల మొక్కలను నాటే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: