మహేష్, రామ్ చరణ్ ఇద్దరు హ్యాండ్.. ఇప్పుడు ఆయనకు ఎవరు దిక్కు..?

P.Nishanth Kumar
మహేష్ గతంలో లా మెతకగా ఉండకుండా సినిమా ల విషయంలో ఎలాంటి డైరెక్టర్ ని అయినా పక్కనపెడుతున్నారు.. కథ బాగుంటే కొత్త డైరెక్టర్ కి కూడా అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారట.. కానీ కథ లో తేడా వస్తే మాత్రం టాప్ డైరెక్టర్ అయినా మధ్య నే నో చెపుతున్నారట.. ఇప్పటికే సుకుమార్, వంశీ పైడిపల్లి వంటి ప్రూవ్డ్ డైరెక్టర్ లకు మొండిచేయి చూపించారు మహేష్.. దాంతో సుకుమార్ వెంతంటే అల్లు అర్జున్ తో సినిమా మొదలుపెట్టినా వంశీ పైడిపల్లి మాత్రం  ఏ హీరో ను పట్టుకోలేదు.. మహేష్ బాబు కూడా గతంలో రెండో సారి ఛాన్స్ లు ఇచ్చిన డైరెక్టర్ లు భారీ ఫ్లాప్ లు ఇవ్వడం చూశారు.. వంశీ కి హ్యాండ్ ఇవ్వడానికి అది కూడా ఓ కారణం అంటున్నారు..

మహేష్ హ్యాండ్ ఇచ్చిన చాల రోజుల తర్వాత ఆయన ఓ కథ తో రామ్ చరణ్ తేజ్ ను ఒప్పించారు. ఇక అన్ని రెడీ ఇక సెట్స్ మీదకు వెళ్లడమే లేట్ అనుకున్నారు.. కానీ అనూహ్యంగా రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములు తో అనౌన్స్ అవుతున్నాయని వార్తలు వస్తుండడంతో వంశీ పైడిపల్లి కి రాంచరణ్ కూడా హ్యాండ్ ఇచ్చాడా అని వార్తలు వస్తున్నాయి..చలో, భీష్మ సినిమాలతో వెంకి కుడుముల దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్నారు.. ఇక రామ్ చరణ్ తుఫాన్ సినిమా కి రచయిత గా పనిచేసిన అనుభవం ఉంది.

ప్రస్తుతం rrr సినిమా చేస్తున్న రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా తర్వాత ఏ సినిమా ని ఒప్పుకోలేదు.. తాజాగా వెంకీ కుడుములు తో నెక్స్ట్ సినిమా చేస్తున్నారని వార్తలు రావడంతో వంశీ సినిమా అటకెక్కేసింది అని అనుకుంటున్నారు.. ఏదేమైనా మహర్షి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి కి హీరో దొరకకపోవడం విడ్డూరమే..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: