ఆశలన్నీఆ ఇండస్ట్రీ పైనే..!

NAGARJUNA NAKKA
టాలీవుడ్ ఇప్పటి వరకు రీమేక్ ల కోసం కోలీవుడ్ పైనే ఆధారపడింది. ఇపుడు మాత్రం మాలీవుడ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త దనంతో కూడిన బలమైన కథలు దొరకడం లేదు.  ఒకరు ఇద్దరు దర్శకులు వచ్చి ప్రయోగాలు చేస్తున్నప్పటికీ.. లాంగ్ టైమ్ ప్రయోగాలు కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. తెలుగు పరిశ్రమకు తమ మొదటి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్న దర్శకులైన  మేర్లపాక గాంధీ, సాగర్ కె చంద్రతో పాటు హను రాఘవపూడి, సుధీర్ వర్మలు ప్రయోగాత్మక చిత్రాలు కొనసాగించలేకపోతున్నారు. కథల విషయంలో వారు ఎంత కొత్తగా చేద్దామని ప్రయత్నం చేసినా.. అవుట్ పుట్ రావడం లేదు. దీంతో ఇక చేసేదేం లేక కోలీవుడ్, మాలీవుడ్ లో విజయవంతమైన కంటెంట్ చిత్రాలను డంప్ చేసుకోవల్సిన పరిస్థితి వచ్చింది.
టాలీవుడ్ లో రీమేక్ లు చేసేవారిలో టాప్ హీరోలే  ఎక్కువగా ఉంటున్నారు. ఇతర భాషలో కథనచ్చితే ....ఆ సినిమా రైట్స్ ను ఫ్యాన్సీ రేట్లు చెల్లించి మరీ కొనేయడం, ఇక్కడ హీరోలతో రీమేక్ లు చేసేయడం మన పరిశ్రమకు సాధారణమైపోయింది.  తాజాగా మెగస్టార్ చిరంజీవి అయితే... కేరళలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడు. ఒకవేళ ఇది లేటైతే ..పవన్ వదిలేసిన వేదాలమ్ చిత్రాన్ని టేకప్ చేయాలని చూస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాలమ్ చిత్రం...రీమేక్ కు రెడీ అవుతున్నట్టు సమాచారం.
మాలీవుడ్ పరిశ్రమకు ఎంతో గౌరవం తెచ్చిపెట్టిన కథా బలమున్న చిత్రం..అయ్యప్పనుమ్ కోషియుమ్. పృథ్విరాజ్, బిజూమీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ అక్కడ సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఇగోల చుట్టూ తిరిగే ఈ కథకు 6కోట్లు పెడితే 60కోట్లు వచ్చిపడ్డాయి. తెలుగు పరిశ్రమలో ఎందరో హీరోలు ఈ సినిమా రైట్స్ కోసం ప్రయత్నం చేశారు. సైలంట్ గా  సితార ఎంటర్ టైన్ మెంట్ ఈ రైట్స్ ను సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: