టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన
సినిమా అలవైకుంఠపురములో.
గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ
సినిమా ఈ ఏడాది
సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది.
అల్లు అర్జున్ సరసన
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు
థమన్ అందించిన సాంగ్స్ ఎంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆరేళ్ళ క్రితం
యువ దర్శకుడు
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో
అల్లు అర్జున్ నటించిన
సినిమా రేసు గుర్రం.
శ్రీ
లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు
శ్రీనివాస్, వెంకటేశ్వర రావు నిర్మాతలుగా తెరకెక్కిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అప్పట్లో పెద్ద హిట్ కొట్టి
అల్లు అర్జున్ కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది.
శృతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు
థమన్ మ్యూజిక్ అందించాడు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య సాగె కథగా పలు రకాల ఎమోషన్స్ యాక్షన్ అంశాలు కలగలిపి దర్శకుడు
సురేందర్ రెడ్డి ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే లేటెస్ట్ గా కొన్ని
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ గా రేస్ గుర్రం పార్ట్ 2 తెరకెక్కనున్నట్లు చెప్తున్నారు.
మొన్నటి లాక్ డౌన్ సమయంలో ఈ సీక్వెల్ కథని సిద్ధం చేసిన
సురేందర్ రెడ్డి, అతి త్వరలో దానిని
అల్లు అర్జున్ కి వినిపించనున్నట్లు సమాచారం. మొదటి భాగాన్ని మించేలా ఈ
సినిమా ఉండనుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా ఒక మంచి
పండుగ వార్త అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు .....!!