పురాణ పురుషుడిలా ప్రభాస్..!

NAGARJUNA NAKKA
ప్రభాస్ కంప్లీట్ మూవీమెన్ లా మారిపోతున్నాడు. ఈట్ సినిమా.. స్లీప్ సినిమా అన్నట్లు ఇంటినే సినిమా ఫీల్డ్ లా మార్చుకుంటున్నాడు. బయటికెళ్తే టైమ్ వేస్ట్ అవుతుందని ఇంటినే వర్క్ షాప్స్ కి కేటాయిస్తున్నాడు. కంప్లీట్ డెడికేషన్ తో  పురాణ పురుషుడిలా మారిపోతున్నాడు డార్లింగ్.  
ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా మారాక చాలా కష్టపడుతున్నాడు. సినిమాకి తగ్గట్లుగా మేకోవర్ అవ్వడానికి చాలా టైమ్ తీసుకుంటున్నాడు. క్యారెక్టర్ కి తగ్గట్టుగా తనని తాను డిజైన్ చేసుకోవడానికి కష్టపడుతున్నాడు. ఇక ఓమ్ రౌత్ దర్శకత్వంలో వెండితెర రాముడిగా కనిపించడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నాడట ప్రభాస్.
మైథలాజికల్ మూవీగా తెరకెక్కుతోన్న ‘ఆది పురుష్’లో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఇక రాముడు విల్లంభుధారి కాబట్టి, ప్రభాస్ కూడా విల్లు ఎక్కుపెట్టాల్సి ఉంటుంది. అందుకే ఇప్పటినుంచే విలువిద్యలో శిక్షణ తీసుకుంటున్నాడట ప్రభాస్. పర్సనల్ ట్రైనర్ ని పెట్టుకుని ఇంటిదగ్గరే ఆర్చరీ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట ప్రభాస్.
ప్రభాస్ ఇంతకుముందు ‘బాహుబలి’కి కూడా ఆర్చరీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. అప్పుడు గెస్ట్ హౌజ్ లో ఆర్చరీ సెటప్ కట్టించి ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడేమే ఇంటిదగ్గరే కోర్ట్ ఏర్పాటు చేయించుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే దర్శకుడు అంత ట్రైనింగ్ అవసరం లేదు, బేసిక్స్ చాలు.. డూప్స్, గ్రాఫిక్స్ తో మేనేజ్ చేద్దాం అన్నా ప్రభాస్ ఒప్పుకోలేదట. పురాణ పురుషుడి పాత్రని కంప్లీట్ గా నేనే చేస్తానని విల్లు ఎక్కుపెడుతున్నాడట ప్రభాస్. ఇక ‘రాధేశ్యామ్’ పూర్తయ్యాక ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది స్టార్ కాబోతోంది.
మొత్తానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు. మొన్నటి వరకూ బాహుబలి కోసం ఏ విధంగా అయితే చెమటోడ్చాడో.. అదే విధంగా ఆదిపురుష్ కోసం శ్రమిస్తున్నాడు. ఆ సినిమా కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ప్రేక్షకుల ఆశలను అడియాశలు చేయడం ప్రభాస్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే సినీ ప్రేక్షకులను సంతృప్తి పరిచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: