వెంకటేష్ ఆడుతున్న సేఫ్ గేమ్ లీక్స్ జోష్ లో అనీల్ రావిపూడి !

Seetha Sailaja
సీనియర్ హీరో వెంకటేష్ తన లేటెస్ట్ మూవీ ‘అసుర’ మూవీ విడుదల కాకుండానే తన 75వ సినిమా గురించి ఆలోచనలు చేస్తున్నాడు. ఇప్పటికే సీనియర్ హీరోలు చిరంజీవి 150 బాలకృష్ణ 100 సినిమాల మార్క్ ను దాటిపోతే నాగార్జున త్వరలో తన 100వ సినిమా మార్క్ వైపు ఆలోచనలు చేస్తున్నాడు.

ఈ రేస్ లో తాను కూడ ఉన్నాను అంటూ వెంకటేష్ తన 75వ సినిమా గురించి ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్లు లీకులు వస్తున్నాయి. వాస్తవానికి వెంకటేష్ తన 75వ సినిమాను తరుణ్ భాస్కర్ లేదా నక్కిన త్రినాథ్ రావ్ లు ఇప్పటికే చెప్పిన కథలలో ఒక కథను ఎంపిక చేసుకుందామని భావించాడు. అంతేకాదు కుదిరితే త్రివిక్రమ్ వైపు కూడ అడుగులు వేద్దామని ప్రయత్నించాడు.


అయితే ఈ ఆలోచనలు అన్నీ మానుకుని ఇప్పుడు వెంకటేష్ ఒక సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం విడుదలై వెంకటేష్ కు మళ్ళీ ఫుల్ జోష్ ను ఇచ్చిన ‘ఎఫ్ 2’ మూవీకి సీక్వెల్ గా అనీల్ రావిపూడి క్రియేట్ చేసిన ‘ఎఫ్ 3’ స్క్రిప్ట్ కు వెంకీ ఓకె చేసాడని టాక్. ప్రస్తుతం ఇతడు నటిస్తున్న ‘అసుర’ మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత వచ్చే ఏడాది ‘ఎఫ్ 3’ మొదలుపెట్టి తన 75వ సినిమాగా ‘ఎఫ్ 3’ హంగామా కొనసాగించాలని వెంకటేష్ ఆలోచన అని అంటున్నారు.

వెంకటేష్ తన కెరియర్ లో నటించిన 50వ సినిమా ‘వాసు’ లో కొన్ని ప్రయోగాలు చేసాడు. అయితే ఆ ప్రయోగం వికటించడంతో అప్పట్లో వెంకీ 50వ సినిమా ఘోరమైన ఫ్లాప్ గా మారింది. దీనితో మళ్ళీ ప్రయోగాల జోలికి పోకుండా అందర్నీ నవ్వించే కామెడీ సబ్జెక్ట్ తో ఎటువంటి సమస్య లేకుండా ఒక సేఫ్ గేమ్ ఆడినట్లు ఉంటుందని వెంకటేష్ భావన. అయితే ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సీక్వెల్స్ గా వచ్చిన సినిమాలు ఏమీ విజయవంతం కాలేదు ఈ కారణంతో వెంకటేష్ వ్యూహం ఎంతవరకు సక్సస్ అవుతుందేమో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: