త్వరలో పేరెంట్స్ కాబోతున్న.... బిగ్ బాస్ జంట

VAMSI
బిగ్ బాస్... సహజమైన నవరసాలను కలగలిపి ఒకే వేదికపై ప్రదర్శించే ఒక గొప్ప కార్యక్రమం. టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే ఒక రియాలిటీ షో....  అభిమానులను టెలివిజన్ కి అతుక్కుపోయేలా చేసే ఒక కళా ప్రపంచం... ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో అభిమానులను ఆకట్టుకుంటోంది బిగ్ బాస్ షో. ఒక్క తెలుగులోనే కాదు తమిళ్, హిందీ, మలయాళం ఇతర భాషలలోనూ ప్రసారం అవుతూ సూపర్ హిట్ అయి అదరహో అనిపించుకుంటున్న ఒక మెగా ప్రోగ్రాం. నటీనటులు ఒక్కసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ లు గా మారితే చాలు వారి మునుపటి రేంజ్ ఏదైనా సరే తర్వాత మాత్రం వారి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది..





దీనికి కారణం ఈ షో లో కనిపించేది నటన కాదు... వారి  నిజజీవితం. మామూలుగా వారి రొటీన్ లైఫ్ లో ఎలా ఉంటారో... ఈ షో లో కూడా అలానే సహజంగా ఉంటారు. అందుకే ఈ బిగ్ బాస్ షో అంతగా గుర్తింపు పొందింది. ఇందులోని కంటెస్టెంట్ లు వారి హుషారైన మాటలతో, పంచ్ లతో, అల్లరి తో, ముద్దొచ్చే గొడవలతో కొద్దిగా మసాలా యాడ్ చేస్తూ తామేంటో ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కొందరు ఇంటి సభ్యుల మనసులు కలిసి ప్రేమించుకుని నిజ జీవితంలో పెళ్లితో ఒకటైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి కోవకే చెందుతారు ఈ మలయాళీ బిగ్ బాస్ జంట.





వారు మరెవరో కాదు మలయాళం బిగ్ బాస్ షోలో చూపులు కలిసిన వారి లవ్ కు,  పెళ్ళితో ప్రాణం పోసిన పెయిర్... మాని & శ్రీనిష్ అరవింద్ ల జంట. షో లో ఉన్నప్పుడే వీరి వ్యవహారం పెళ్లి దాకా వెళుతుందని అందరూ ఊహించినట్లే జరిగింది.. ఇంకేముంది షో అయిిన వెంటనే వివాహం, ఏడాది తిరక్కుండానే  తొలి బిడ్డ కు జన్మనిచ్చారు. ఇప్పుడు మరోసారి తల్లి కాబోతున్నా  అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ మలయాళీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మాని. విషయం తెలుసుకున్న వీరి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: