కరోనా బారినపడిన... ప్రముఖ సినీ తారలు?

VAMSI
చిన్నా,పెద్దా ఆ పరిశ్రమ, ఈ పరిశ్రమ అని ఎటువంటి తేడాలు లేకుండా కరోనా అందరినీ గడగడ లాడించేస్తోంది... ఎంత గొప్ప వారైనా, ఎంత పేదవారైనా ఆరోగ్య సూచనలు పాటించకపోతే కరోనా బారిన పడాల్సిందే. ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చిన వెండితెర తారలు మరియు బుల్లితెర సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం... మాటీవీ లో ప్రసారం అవుతున్న ఆమె కథ సీరియల్ ఫేమ్ నవ్య స్వామి, తెలుగు యాక్టర్ అయిన భరద్వాజ్ రంగవజ్జల... ప్రస్తుతం ఈయన జెమినీ టీవీలో బంధం సీరియల్ లో హీరోగా చేస్తుండగా, ఈటీవీ లో ప్రసారం అవుతున్న స్వాతి చినుకులు సీరియల్ లో ఓ ప్రముఖ ఓ పాత్రలో నటిస్తున్నారు.


జి టీవీలో ప్రసారమవుతున్న సూర్యకాంతం సీరియల్ లో నటిస్తున్న బొడ్డు ప్రభాకర్, బిగ్ బాస్ సీజన్ 3 షో తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటుడు రవి కృష్ణ, మాటీవీలో ప్రసారం అవుతూ  ప్రేక్షకుల ఆదరభిమానాలను అందుకుంటున్న వదినమ్మ సీరియల్ లో నటిస్తున్న సీనియర్ యాక్టర్ శివ పార్వతి....ఇక సినీ రంగానికి వస్తే.... గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం,ఇండియన్ పాప్ సింగర్ అయిన స్మిత, తమిళ హీరో విశాల్, బాలీవుడ్ బిగ్ బి ఫ్యామిలీ అయిన అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్ ,ఐశ్వర్యరాయ్ వారి గారాలపట్టి ఆరాధ్య, తెలుగు సింగర్ మాళవిక తదితర సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కరోనా టెస్ట్ చేయించుకోగా వీరికి పాజిటివ్ వచ్చింది. కొందరు ఇప్పటికే కోలుకున్నారు మరికొందరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.


ఏదేమైనా కరోనా వైరస్ కు దూరంగా ఉండాలంటే కరోనా ఆరోగ్య సూత్రాలు కచ్చితంగా పాటించాల్సిందే... ఇప్పటికే పలువురు సినీ స్టార్లు అయిన చిరంజీవి, రామ్ చరణ్, రానా, నాని, ఎన్టీఆర్, నమ్రత సిరోజ్కర్, వంటి ప్రముఖ సెలబ్రెటీలు కరోనా కాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. మరికొంతమంది ప్రముఖులు కవితలతో, పాటలతో, డైలాగులతో కరోనా నియంత్రణకు కదం తొక్కారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: