ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు.... అయితే ప్రభాస్ పెళ్లి అప్పుడేనా...?
ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్ లో "రాదే శ్యాం " అనే వింటేజ్ లవ్ స్టోరీ చేస్తున్నారు డార్లింగ్.. ఆ తదుపరి వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వం లో సోషియో సైంటిఫిక్ ఫాంటసీ కి ఆల్రెడీ కమిట్ అయ్యాడు మన చత్రపతి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి క్యూలో ఉన్నాయి. ఓ సినిమా సెట్స్ పై ఉంటే, మరొకటి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉండగానే మూడో పాన్ ఇండియా ప్రాజెక్ట్ "ఆది పురుష్" కు సైన్ చేశారు ప్రభాస్..ఇలా ఇప్పటికే ఒప్పుకున్న బిగ్ సినిమా ప్రాజెక్టులతో మరో మూడేళ్లకు గాని ఫ్రీ అయ్యేలా కనిపించడం లేడు ప్రభాస్.
ఇక బాహుబలి పెళ్లి అంటే ఆషామాషీ విషయం కాదు అంత టైమ్ ఇప్పట్లో ప్రభాస్ కి లేదు కాబట్టి పెదనాన్న కృష్ణం రాజు ఇచ్చిన ప్రభాస్ పెళ్లి స్టేట్మెంట్ కు స్టే పడనుందని తెలుస్తోంది. ప్రభాస్ పెళ్ళి మాట మరో మూడేళ్ల తర్వాతే అని తెలుస్తోంది.