దిల్ రాజ్ డ్యూయల్ స్ట్రాటజీ పై సమాధానం లేని ప్రశ్నలు !

Seetha Sailaja

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నిర్మాతలలో చాలమందు చూపుతో దిల్ రాజ్ వ్యవహరిస్తూ ఉంటాడు అని అంటారు. టాప్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అందరితోను సన్నిహితంగా కొనసాగే దిల్ రాజ్ సినిమాలలో నటించడానికి హీరోలు అందరు చాల ఇష్టపడుతూ ఉంటారు.

దీనికితోడు హీరోలకు తగ్గట్టుగా కథలను ఎంచుకోవడమే కాకుండా నిర్మాణం చేసే సినిమాలలో మంచి క్లాలిటీ పాటిస్తూ తన సినిమాలలో నటించే అందరికీ ఒప్పుకున్నా పారితోషికాలు ఖచ్చితంగా ఇవ్వడం దిల్ రాజ్ కు అలవాటు. ఇలాంటి దిల్ రాజ్ ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ ‘వి’ ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కు సుమారు 30 కోట్లకు అమ్మడం వెనుక దిల్ రాజ్ అనుసరించిన ద్విముఖ వ్యూహం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

ఇండియా హెరాల్డ్ కు అందుతున్న సమాచారం ప్రకారం కేంద్రప్రభుత్వం వచ్చేనెల నుండి ధియేటర్లు ఓపెన్ చేయడానికి పరిమిత స్థాయిలో అనుమతులు ఇచ్చే ఆస్కారం ఉంది అని తెలుస్తోంది. అమెజాన్ తో దిల్ రాజ్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలో ‘వి’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదలైనా ధియేటర్లు ఓపెన్ అయితే ఈమూవీని పరిమిత సంఖ్యలో ధియేటర్లలో వెంటనే విడుదల చేయడానికి అమెజాన్ నుండి ఎటువంటి అభ్యంతరం లేకుండా ముందుగానే అనుమతులు తీసుకున్నాడని టాక్.

దీనితో నానికి ఉన్న క్రేజ్ రీత్యా ఈమూవీ ధియేటర్ల నుండి కనీసం అతి తక్కువ కలక్షన్స్ రాబట్టినా ఈమూవీ వల్ల మరో 5-6 కోట్ల కలక్షన్స్ వస్తాయి కాబట్టి అమెజాన్ తనకు ఇచ్చే మొత్తానికి ధియేటర్ల నుండి వచ్చే కలక్షన్స్ తో పాటు ‘వి’ రీమేక్ రైట్స్ ను బాలీవుడ్ నిర్మాతలకు భారీ మొత్తానికి అమ్మిన పరిస్థితులలో ఇలాంటి కష్టకాలంలో కూడ దిల్ రాజ్ తెలివిగా వ్యవహరించి ‘వి మూవీతో లాభాలు పొందాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దిల్ రాజ్ తెలివితేటలు ఇప్పటి వరకు తమకెందుకు లేకుండా పోయాయి అంటూ చాలామంది నిర్మాతలు ఆశ్చర్య పడుతున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: