ఆ హీరో కోసం కాదనకుండా వచ్చేది జాన్వీ కపూర్..పూజా హెగ్డే లలో ఎవరు ..?
ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పోరాట యోధుడు కొమరం భీం గా కనిపించబోతున్నాడు. అంతేకాదు మొత్తం ఆరు రకాల గెటప్స్ లో అభిమానులకి సర్‌ప్రైజ్ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జంటగా బ్రిటన్ మోడల్ ఓలియా మోరిస్ నటిస్తుంది. ఇప్పటికే రాం చరణ్ పాత్రని రివీల్ చేయడంతో నందమూరి అభిమానులు ఎన్.టి.ఆర్ పాత్ర కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 న ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రని రివీల్ చేస్తూ టీజర్ రిలీజ్ చేస్తారని అందరు భావించారు.
కాని రాజమౌళి కి కరోనా పాజిటివ్ రావడంతో అది సాధ్యం కాలేదని అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో వినాయక చవితి కి ఈ టీజర్ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ ..తన నెక్స్ట్ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియోషన్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.
అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని ప్రచారం జరుగుతుంది. వాళ్ళలో ఒకరు జాన్వీ కపూర్ లేదా పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో అరవింద సమేత లో నటించింది. అలాగే త్రివిక్రం తెరకెక్కించిన అల వైకుంఠపురములో సినిమాలోను నటించింది. కాబట్టి ఎక్కువ శాతం పూజా హెగ్డే కే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఒప్పుకుంటుందా లేక మరో హీరోయిన్ ని సంప్రదిస్తారా చూడాలి.