అందులో ఏ ఒక్కటి పెద్ద సక్సెస్ అయినా ..... ఆయనకు అదృష్టమే .....??
ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన మణిశర్మ, అప్పటి పెద్ద, చిన్న హీరోలందరితోను ఎన్నో సినిమాలకు పని చేసారు. ఆ విధంగా కొన్నేళ్ల పాటు వరుస అవకాశాలతో కొనసాగిన మణిశర్మ, కెరీర్ పరంగా ఎన్నో గొప్ప మ్యూజికల్ సక్సెస్ లు అందుకుని ఉన్నత స్థాయిని అందుకున్నారు. అయితే ఇటీవల కొన్నేళ్ల క్రితం యువ సంగీత దర్శకులైన దేవిశ్రీ ప్రసాద్, థమన్ ల రాకతో కొంత వెనుకబడ్డ మణిశర్మ, కొన్నాళ్ల క్రితం నాని హీరోగా తెరకెక్కిన జెంటిల్ మ్యాన్, రామ్ హీరోగా పూరి తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాల సక్సెస్ లతో పాటు ఆ సినిమాలకు అద్భుతమైన సాంగ్స్ తో పాటు అదరగొట్టే రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించి తన మ్యూజికల్ పవర్ ని మరొక్కసారి నిరూపించుకున్నారు.
ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, విజయ్ దేవరకొండ ఫైటర్, వెంకటేష్ నారప్ప, రామ్ నటిస్తున్న రెడ్ సినిమాల అవకాశాలతో కొనసాగుతున్న మణిశర్మకు వాటిలో ఏ ఒక్క సినిమా మంచి సక్సెస్ సాధించినా, రాబోయే రోజుల్లో అది ఆయనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు. మరి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఆ సినిమాలు రేపు రిలీజ్ తరువాత ఎంతమేర సక్సెస్ సాధించి కెరీర్ పరంగా మణిశర్మ కు ఎంతవరకు బ్రేక్ ని అందిస్తాయో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే ....!!