హాట్ న్యూస్ గా మారిన దేవకట్ట ఇంద్రప్రస్థం !

Seetha Sailaja
క్రియేటివ్ దర్శకుడు దేవకట్ట దర్శకత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ల మైత్రీ ఆతరువాత ఏర్పడిన శతృత్వం వాస్తవ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఒక పొలిటికల్ బయోపిక్ నిర్మిస్తున్నట్లుగా గత కొద్ది రోజుల నుండి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ బయోపిక్ ఆలోచన తనది అంటూ విష్ణు ఇందూరి రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.


అయితే విష్ణు తో తాను షేర్ చేసిన తన ఆలోచనను విష్ణువు కాపీ కొట్టాడని వాస్తవానికి ఈ బయోపిక్ ఆలోచన తనది అని అంటున్నాడు. అంతేకాదు దీనికి సంబంధించిన కథను ఇప్పటికే తాను రిజిష్టర్ చేసిన పరిస్థితులలో ఈ ప్రాజెక్ట్ పై తనదే ఫైనల్ నిర్ణయం అని తన వాదన కొనసాగిస్తున్నాడు. అయితే విష్ణు మాత్రం ఇదే సినిమా కథను తాను ‘రాజనీతి’ అన్న టైటిల్ తో 2015 లోనే రిజిష్టర్ చేసాను అని అంటున్నాడు.


వీరిద్దరి మధ్య ఈ వాద ప్రతివాదనలు కొనసాగుతూ ఉండగానే ‘ఇంద్రప్రస్థం’ టైటిల్ తో దేవకట్ట తన సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోష్టర్ ను విడుదల చేయడమే కాకుండా చంద్రబాబునాయుడు వై ఎస్ ఆర్ ల బయోపిక్ కు రంగం సిద్ధం చేసాడు. రాయలసీమ ప్రాంతానికి చెందిన వై ఎస్ ఆర్ చంద్రబాబులు మొదట్లో యువజన కాంగ్రెస్ నేతలుగా అనేక సంవత్సరాలు కొనసాగారు.


ఆతరువాత కీలక నేతలుగా ఎదగడమే కాకుండా ఆపై శతృవులుగా మారిపోయి ఒకరి పై ఒకరు రాజకీయ పోరాటం చేసుకున్న వీరిద్దరి జీవితాలలో అనేక ట్విస్ట్ లు మరిన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి చనిపోయినా చంద్రబాబునాయుడు కు పదవి పోయినా ఇప్పటికీ వారిద్దరి ప్రస్తావనా లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు. అలాంటి వీరిద్దరి రాజకీయాల జీవితాల పై తీస్తున్న ‘ఇంద్రప్రస్థం’ ఎంతవరకు వీరిద్దరి జీవితాలలోని అసలు నిజాలను బయట పెట్టగలిగితే ఒక మంచి పొలిటికల్ మూవీ అవుతుందని ఇండియా హెరాల్డ్ భావిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: