వైమానికాదళం అసహనంలో జాహ్నవి ?

frame వైమానికాదళం అసహనంలో జాహ్నవి ?

Seetha Sailaja
నిన్న నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలైన ‘గుంజన్ సక్సెనా’ మూవీకి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.  కార్గిల్ గర్ల్ గా పేరుగాంచిన గుంజన్ సక్సెనా జీవితం పై తీసిన ఈ బయోపిక్ వాస్తవానికి దగ్గరలో ఉందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి మహిళా పైలెట్ గా చరిత్రను సృష్టించిన గుంజన్ సక్సెనా జీవితంలో ఎన్నో ఎదురీతలు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈమెకు భారత వైమానిక దళంలో పైలెట్ కావాలన్నది జీవిత ధ్యేయం. అయితే ఈ ధ్యేయాన్ని అందుకోవడంలో ప్రస్తుత పురుషాధిక్య సమాజంలో ఈమె ఎదుర్కున్న అనేక సమస్యలు ఈమూవీలో చూపించారు.


గుంజన్ సక్సెనా పాత్రను పోషించిన జాహ్నవి ఈ పాత్రలో చాల సహజంగా నటించడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కూడ స్త్రీ పురుషుల మధ్య అంత వ్యత్యాసం ఉందా అన్న సందేహాలు ఈమూవీని చూసిన వారికి కలుగుతాయి. అయితే ఈ సున్నిత విషయాన్ని పసిగట్టిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వర్గాలు కొన్ని అభ్యంతరాలను ఈమూవీ పై వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్న విషయం ఇండియా హెరాల్డ్ దృష్టికి వచ్చింది.


ఈ మూవీలోని కొన్ని సంభాషణలు భారత వైమానికి దళం పై నెగిటివ్ అభిప్రాయం వచ్చేలా ఉన్నాయని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి వివక్షత ఉండదని కేవలం ప్రతిభను మాత్రమే పరిగణిస్తామని ఎయిర్ ఫోర్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈసినిమా నిర్మించే ముందు ఈమూవీ నిర్మాతలు ఈమూవీ నిర్మించే విషయంలో  వైమానిక దళం గౌరవాన్ని పెంచేలా భవిష్యత్ తరాలకు ఎయిర్ ఫోర్స్ ఆదర్శవంతంగా ఉండేలా సినిమాను తీస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీ నిర్మాతలు తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడంతో ఈసినిమాలో ఎయిర్ ఫోర్స్ కు అభ్యంతరం కల్గించే సన్నివేశాలను తొలిగించమని సెన్సార్ ను అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈమూవీ ఓటీటీ వేదిక పై విడుదల కావడంతో ఈవిషయంలో సెన్సార్ ఎలా స్పందిస్తుంది అన్నది ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్న..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: