మన హీరోలు అవెంజర్స్ అయితే..ఎవరు ఏ క్యారెక్టర్ కి సరిపోతారో చూడండి..!!!!

Purushottham Vinay
అవెంజర్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనవసరం లేదు.ఇది సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. ఒక్కొక్క రికార్డు బద్దలు కొట్టుకుంటూ పెను తుఫాన్ సృష్టిందీ ఈ చిత్రం. అప్పటివరకు పదిలంగా వున్నా అవతార్ రికార్డు ని బద్దలు కొట్టింది. ఈ రికార్డు కొట్టడానికి 10 సంత్సరాలు పట్టింది. మార్వెల్ స్టూడియోస్ దాదాపు గా 35.6 కోట్ల యు యస్ డాలర్ల తో  ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మించిన అవెంజర్స్ ఎండ్ గేమ్ 279.8 కోట్ల యూ యస్ డాలర్స్ వసూళ్ళని   కొల్లగొట్టి అవతార్ పేరిట వున్నా అత్యధిక వసూళ్ల రికార్డు 279 కోట్ల యూ యస్ డాలర్స్ రికార్డు ని బీట్ చేసింది. వరల్డ్ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ప్రపంచంలోకెల్లా ఎక్కువ వసూళ్లు సాదించిన చిత్రం గా చరిత్ర తిరగ రాసింది ఈ చిత్రం.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే అందులోని క్యారెక్టర్ లు మన తెలుగు స్టార్ నటులు పోషిస్తే ఎవరికీ ఏ సూపర్ హీరో క్యారెక్టర్ లు సూట్ అవుతాయో చూద్దాం రండి..

ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగా సరిపోతాడు. కెప్టెన్ అమెరికాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, థోర్ క్యారెక్టర్ కి మెగా పవర్ స్టార్ రాంచరణ్, హల్క్ క్యారెక్టర్ కి రెబల్ స్టార్ ప్రభాస్, క్లింట్ బర్టోన్ క్యారెక్టర్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆంట్ మ్యాన్ క్యారెక్టర్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ విడో క్యారెక్టర్ కి కాజల్ అగర్వాల్, కరోల్ దన్వేర్స్ క్యారెక్టర్ కి సమంత, తానొస్ క్యారెక్టర్ కి రానా దగ్గుబాటి కరెక్ట్ గా సెట్ అవుతారు. సరదాగా ఏ డైరెక్టర్ అయినా తెలుగు అవెంజర్స్ సినిమా తీస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు వుండవు ఇక.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: