అలా చెప్పే ఎంతో మందిని షెడ్ కి పంపించారు ...... చాలు చాలు ఇంక ఆపండి .....??

GVK Writings
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తన సినిమాలకు సంబంధించి సీన్స్ షూటింగ్ సమయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటారని, ఎప్పుడైతే షూటింగ్ పూర్తి అవుతుందో వెంటనే మంచి హ్యాపీ మూడ్ కి వచ్చేసి అందరితో సరదాగా మాట్లాడుతూ జోక్స్ వేస్తుంటారని ఆ విధంగా వర్క్ పట్ల ఆయనకు ఉన్న డెడికేషన్ అంత గొప్పదని అంటుంటారు పలువురు సినిమా ప్రముఖులు. అయితే హీరోగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో కొంత రిజర్వుడుగా ఉన్న మహేష్ బాబు, రాను రాను తన తీరు ఎంతో మార్చుకున్నారు.


ఇక కొన్నేళ్ల క్రితం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ ఓపెన్ చేసి, తన సినిమా, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్, ప్రేక్షకుల తో షేర్ చేసుకునే అలవాటున్న మహేష్ మధ్యలో వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇవ్వడం తోపాటు ఎక్కువగా ఇంటర్వ్యూ ల్లో కూడా ఎంతో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. మహేష్ తో మాట్లాడాలన్నా లేదా ఇంటర్వ్యూ చేయాలన్న కొంత భయంగా ఉంటుందని ఎందుకంటే తనపై అవతలి వాళ్ళు సెటైర్ వేస్తున్నారు అని తెలియగానే వెంటనే దానికి బదులుగా ఆయన కూడా నవ్వుతూ సెటైర్ వేసి అందరినీ నవ్విస్తూ ఉంటారని పలువురు ప్రముఖులు, వ్యాఖ్యాతలు చెప్తూ ఉంటారు. మొదటి నుండి కూడా తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా తండ్రి కృష్ణ మాదిరిగా కొంత సూటిగా మాట్లాడే అలవాటున్న మహేష్, ఇటీవల సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రమోషన్స్ సమయంలో జరిగిన ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు తనదైన స్టయిల్ లో సెటైరికల్ గా కామెంట్ చేసారు.


సర్, మీరు చూడడానికి ఎంతో అందంగా ఉండడంతో పాటు, కోట్లాదిమంది అభిమానులను సంపాదించారు కదా, మీవంటి వారు బాలీవుడ్ కి ఎందుకు వెళ్ళకూడదు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు, ఇదిగో ఇలానే గతంలో కూడా ఎంతో మంది నటులను పొగిడి పొగిడి చివరకు వాళ్ళను షెడ్ కి పంపించేశారు, చాలు చాలు ఇక ఆపండి అంటూ మహేష్ వేసిన కామెడీ సెటైర్ కు యాంకర్ సహా ప్రక్కన ఉన్న నటులందరూ పగలబడి నవ్వడం మొదలెట్టారు. అందుకే మహేష్ తో కాసేపు మాట్లాడితే చాలు, ఆయనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుందని అంటుంటారు పలువురు నటులు ....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: