బిగ్ బాస్ 4 కంటెస్టంట్స్ కు నాగార్జున రిక్వెస్ట్..!
ఇప్పటికే హౌజ్ లోకి ఎవరెవరు వస్తున్నారు అన్న విషయాన్ని బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జునకు చెప్పారట. ఈసారి స్టార్ కంటెస్టంట్స్ కూడా బిగ్ బాస్ కంటెస్టంట్స్ గా వస్తారని తెలుస్తుంది. సీజన్ 3 హుశారైన హోస్టింగ్ టాలెంట్ తో మెప్పించిన నాగార్జున ఈ సీజన్ ను కూడా అదే జోష్ తో కొనసాగించాలని చూస్తున్నారు. ఆటలు, పాటలు, మధ్యలో బిగ్ బాస్ టాస్కులు ఇలా బిగ్ బాస్ హౌజ్ లోపల కంటెస్టంట్స్ బయట హోస్ట్ గా నాగార్జున ప్రేక్షకులకు ఫుల్ ఫన్ ఇవ్వాడానికి వచ్చేస్తున్నారు.
ఈమధ్య వార్తల్లో ఈ సీజన్ కేవలం 50 రోజులు మాత్రమే ఉంటుందని అన్నారు.. కాని అలాంటిదేమి లేదని తెలుస్తుంది. ఎప్పటిలానే 100 రోజులు బిగ్ బాస్ హౌజ్ లో ఉండాల్సిందే. 15 మంది కంటెస్టంట్స్ ఉండగా ఒకరిద్దరు ప్రతిసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుంటారు. ఈసారి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీనే డౌట్ అని తెలుస్తుంది. అయితే 30 మంది ఫైనల్ కంటెస్టంట్స్ లో హౌజ్ లోకి వెళ్ళెది 15 మంది మాత్రమే మిగిలిన ఆ 15 మందిలో ఇద్దరిని వైల్డ్ కార్డ్ గా పంపిస్తారు. బిగ్ బాస్ సీజన్ 4 ఈ నెల చివర్లో మొదలవనుంది. మరి ఈ సీజన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.