టాలీవుడ్ లో న్యూ గ్లామర్.. !
తెలుగులో కన్నడ భామల డామినేషన్ కొనసాగుతోంది. మరో బెంగళూరు బ్యూటీ అమ్రిత అయ్యర్ తెలుగులో అదృష్టం పరీక్షించుకుంటోంది. రెండేళ్ల క్రితం పడైవీరన్ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. బీకాం చదివిన ఈ అమ్మడు 23ఏల్ల వయసులో నటించడం స్టార్ట్ చేసి తక్కువ టైమ్ లో గుర్తింపు తెచ్చుకుంది.
అమ్రిత అయ్యర్ తమిళంలో రెండు సినిమాలు చేసిందో లేదో తెలుగు ఇండస్ట్రీ స్వాగతం పలికింది. 30రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిన్న సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు రామ్ రెడ్ మూవీలో నటిస్తోంది. అమ్రిత అయ్యర్ తెలుగు ఎంట్రీ రీలీజ్ కు కరోనా అఢ్డుపడింది. తెలుగులో నటించిన రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.
తెలుగు ఇండస్ట్రీకి ఎక్కువమంది హీరోయిన్స్ ను పరిచయం చేసిన దర్శకుల్లో పూరీ ఒకరు. కొడుకు ఆకాశ్ నటిస్తున్న రొమాంటిక్ మూవీ కోసం ఢిల్లీ అమ్మాయి కేతిక శర్మను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. కేతిక శర్మ వెండితెరకు కొత్తే అయినా.. సోషల్ మీడియాలో పాపులర్ డబ్ స్మాష్ లతో బాలీవుడ్ సెలబ్రెటీస్ ను ఆకట్టుకుంది. ఆమె స్వతహాగా సింగర్. మల్టీటాలెంటెడ్ ఉన్న కేతిక శర్మ తెలుగు మూవీ రొమాంటిక్ తో హీరోయిన్ గా అడుగుపెట్టింది.
ప్రముఖ సినిమాటో గ్రాఫర్ కె.యు మోహనన్ కూతురైన మాళవిక ఆరేళ్ల క్రితం మలయాళ చిత్రం ఫట్టమ్ పోలేతో హీరోయిన్ గా పరిచయమైంది. ఐదేళ్లు తిరగకుండా మలయాళంతో పాటు.. తమిళం, కన్నడలో నటించింది. బియాండ్ ద క్లౌడ్ తో హిందీలో అడుగుపెట్టింది మాళవిక. విజయ్ దేవరకొండ హీరో మూవీతో తెలుగులోకి అడుగుపెట్టినా.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. తెలుగులో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి.