బంగారు పతకాల కోసం టాలీవుడ్ హీరోల పోటీ..!
లవ్ స్టోరీస్ తో యూత్ కు కనెక్ట్ అయ్యాడు నాగ శౌర్య. లవబుల్ క్యారెక్టర్స్ తో మెప్పించిన ఈ హీరో ఇప్పుడు ఆర్చర్ లా మారాడు. సంతోష్ జార్లమూడి దర్శకత్వంలో ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాడు శౌర్య. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
యూత్ ఫుల్ క్యారెక్టర్స్ తో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. రౌడీ ఇమేజ్ తో భారీ మార్కెట్ సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ గా మారాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ఒక సినిమా చేయబోతున్నాడు విజయ్. ఈ సినిమా కోసం థాయిలాండ్ లో మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు విజయ్ దేవరకొండ.
సినిమాకో జానర్ ట్రై చేసే వరుణ్ తేజ్, ఇప్పుడు బాక్సింగ్ రింగులోకి దిగుతున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సర్ గా మారిపోయాడు వరుణ్. గీత ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రాబోతోంది. ఇక లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు రోజూ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు వరుణ్.
సినిమా అనగానే.. ఆరు పాటలు, నాలుగు కామెడీ ట్రాక్స్ మధ్యలో ఫైట్స్.. ఇలా ఒక ఫార్మాట్ ఉంటుంది. అయితే ఎప్పుడూ ఇదే ట్రాక్ లో వెళ్లడం హీరోలకు కూడా బోరింగ్ గా ఉంటోంది. అందుకే ఈ రెగ్యులర్ ఫార్మాట్ కు బ్రేక్ ఇచ్చి ఆటగాళ్లకూ మారిపోయాయి, గ్రౌండ్ లో దిగుతున్నారు టాలీవుడ్ స్టార్లు.