వండిన కూటిలోనే మన్ను వెయ్యటం అంటే ఇదేనేమో.. టాలీవుడ్ పై ఇలియాన సంచలన వ్యాఖ్యలు..?

praveen
సన్నజాజి నడుము అందాలతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులందరికీ మెలికలు తిరిగేలా చేసి... జీరో సైజ్ అందాల ఆరబోతతో... ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని... టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఇలియానా. ప్రతి సినిమాలో కూడా టాలీవుడ్  ప్రేక్షకులు ఈ గోవా బ్యూటీని అందరూ ఎంతగానో ఆదరిస్తూ వచ్చారు. ఇక దాదాపుగా దశాబ్దకాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా  కొనసాగింది గోవా బ్యూటీ ఇలియానా. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా  ఉన్న సమయంలోనే బాలీవుడ్ కి వెళ్ళింది... ఇక్కడ మొదట్లో బాగానే అవకాశాలు అందుకున్నప్పటికీ ఈ అమ్మడు నటించిన సినిమాలు బాక్సాఫీస్  వద్ద బోల్తా కొట్టడంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీ పై కన్నేసింది ఈ ముద్దుగుమ్మ,



మరో సారి తెలుగు ఇండస్ట్రీ చేరదీసింది. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఇలియానా. ఈ సినిమా కూడా అంతగా కలిసి రాలేదు కానీ... టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సినిమాలో మాత్రం ఇలియానా ఛాన్స్ కొట్టేసింది అని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇలియానా పై టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా టాలీవుడ్ ఇండస్ట్రీపై నీకు ఉన్న గౌరవం అంటూ నిలదీస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది.. ఎందుకు టాలీవుడ్ ప్రేక్షకులు ఇలియానాపై అంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..?  ఇటీవలే ఇలియానా టాలీవుడ్ లో నెపోటిసమ్  పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా టాలీవుడ్ లో ఎక్కువగా నేపోటిసమ్   ఉందని.. కొత్త నటీనటులను, బయటనుంచి వచ్చిన నటులను ఎదగనీయరు అంటూ సంచలన కామెంట్స్ చేసింది ఈ గోవా బ్యూటీ.



ఇది కాస్తా చర్చనీయాంశంగా మారిపోయింది. నిజంగానే టాలీవుడ్ లో కొత్త వారిని ఎదగనివ్వకపోతే నువ్వు స్టార్ హీరోయిన్ ఎలా అయ్యావు... ఎలా అన్ని సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నావు  అంటూ అందరూ సోషల్ మీడియా వేదికగా ఇలియానాను  నిలదీస్తున్నారు. అంతేకాదు ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు కూడా ఇలియానా  పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: