రిలీజై 21 ఏళ్ళు అయినా...... ఆ సినిమా పవర్ మాత్రం ఇంకా తగ్గలేదు .....!!
అప్పట్లో మంచి అంచనాలతో రిలీజైన ఈ సినిమాతో పెద్ద సంచలన విజయాన్ని అందుకుని, తండ్రికి తగ్గ తనయుడిగా మహేష్ బాబు మంచి పేరు దక్కించుకున్నారు. లవ్, యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా గా పలు ఎంటర్టైన్మెంట్ అంశాలు కలగలిపి దర్శకుడు రాఘవేంద్రరావు ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. మహేష్ బాబు అద్భుత నటన, డాన్స్, ఫైట్స్ ,మణిశర్మ అదిరిపోయే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మహేష్, ప్రీతిజింతాల లవ్, రొమాంటిక్ సీన్స్, గ్రాండియర్ విజువల్స్ వంటివి ఈ సినిమా సూపర్ హిట్ కావడానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ అయి, నేటితో 21 సంవత్సరాలు పూర్తి అయింది.
ఈ సందర్భంగా, కాసేపటి క్రితం మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ సినిమా దర్శకుడు కె.రాఘవేంద్రరావు కు, సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని, తొలి సినిమాతోనే ఇంత గొప్ప టీం తో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తన పోస్టులో తెలిపారు. ఈ సినిమా వచ్చి 21 ఏళ్లు గడిచినా, ఇప్పటికీ ఇందులోని పాటలు, గిటార్ మ్యూజిక్ వంటివి అక్క్డడక్కడా పలుచోట్ల వినిపిస్తూనే ఉంటాయి అంటే, దీని క్రేజీ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు....!!