వైవిధ్యమైన పాత్రల్లో మమ్ముట్టి పుత్రరత్నం.. !
మహానటి సినిమాలో సావిత్రి భర్త జెమినీ గణేష్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ డెబ్యూ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మహానటి హిట్ అయినా.. రెండో సినిమా చేసేందుకు రెండేళ్లు సమయం తీసుకున్నాడు. మహానటి తీసిన వైజయంతీ మూవీస్ బేనర్ లోనే మరో మూవీ ఓకే చేశారు. దుల్కర్ బర్త్ డే సందర్భంగా సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. హను రాఘవపూడి దర్శకుడు కాగా.. పోస్టర్ పై యుద్ధంతో రాసిన ప్రేమ కథ అని రాసి ఉంది.
2012లో అందాల రాక్షసి మూవీ దర్శకుడిగా హను ప్రయాణం మొదలైంది. ఈ ఎనిమిదేళ్లలో నాలుగు సినిమాలు తీస్తే.. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఒక్కటే హిట్ అయింది. అందాల రాక్షసితో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నా.. సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. నితిన్ తో తీసిన లై.. శర్వాతో పడిపడి లేచె మనసు కూడా నిరాశనే మిగిల్చాయి. ఐదో సినిమా కోసం.. 1964వ సంవత్సరం బ్యాక్ డ్రాప్ ప్రేమ కథను ఎంచుకున్నాడు దర్శకుడు.
దుల్కర్ బర్త్ డే సందర్భంగా మలయాళంలో నటిస్తున్న కురుప్ టీజర్ ను రిలీజ్ చేశారు. 80లో కేరళ ప్రాంతాన్ని వణికించిన క్రిమినల్ సుకుమార కురుప్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో దుల్కర్ కురుప్ గా నటించడమే కాకుండా.. సినిమాను సొంతంగా నటిస్తున్నాడు కూడా. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకుడు. ఇలా ఒకేసారి తెలుగు, మలయాళంలో 60..80 దశకం నేపథ్యమున్న కథల్లో నటిస్తూ.. డిఫరెంట్ గా కనిపించనున్నాడు ఈ మలయాళ హీరో. మొత్తానికి మమ్ముట్టి పుత్ర రత్నం వైవిధ్యమైన పాత్రల్లో మెరిసిపోతూ.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకంటున్నాడు.