పూజా హెగ్డేకి నిర్మాత ఫోన్ కాల్.. ఆపై షాక్..

Deekshitha Reddy

పూజా హెగ్డే ఇటీవల ఓ నిర్మాతకి షాకిచ్చింది. కరోనా టైమ్ లో ఈ షాకేంటా అని ఆయన పూర్తిగా డంగైపోయారట. వాస్తవానికి కరోనా లాక్ డౌన్ వల్ల ఎక్కడి షూటింగ్ లు ఎక్కడికక్కడ ఆగిపోయి, రిలీజ్ లు, సినిమా బిజినెస్ లు అన్నీ దెబ్బతిన్నాయి. దీంతో సినీ తారలంతా తమ పారితోషికాలను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అలా అనుకున్నారో లేదో.. కీర్తి సురేష్ తన పారితోషికాన్ని సగం చేస్తున్నానంటూ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దాదాపుగా మిగతా హీరోలు, హీరోయిన్లు కూడా ఇదే బాటలో ఉన్నారని తెలుస్తోంది. అయితే పూజా హెగ్డే మాత్రం పారితోషికాన్ని రెట్టింపు చేసే ఆలోచనలో ఉందట. ఇటీవల ఓ సినిమాకోసం పూజాని ఫోన్లో సంప్రదించిన నిర్మాతకు ఈ షాకింగ్ న్యూస్ చెప్పిందట పూజా హెగ్డే. 

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతోంది పూజా హెగ్డే. అలవైకుంఠ పురంలో హిట్ తర్వాత ఆమెకు మంచి క్రేజీ ప్రాజెక్ట్ లు సెట్ అయ్యాయి. ప్రభాస్ సరసన రాధేశ్యామ్, అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు చోస్తోంది పూజా. అలవైకుంఠ పురంలో సినిమాకు పూజా కోటీ 40లక్షల పారితోషికం తీసుకుందని టాక్. అయితే అంతకు ముందే సాక్ష్యం సినిమాకోసం తన కెరీర్ లోనే అత్యథికంగా ఆమె కోటిన్నర రూపాయలు తీసుకుంది. ప్రభాస్ రాథేశ్యామ్ కూడా దాదాపు కోటిన్నరకే చేస్తున్న పూజాహెగ్డే, అఖిల్ సినిమా కూడా పాత కమిట్ మెంట్ కే అంగీరకించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీకోసం అఖిల్ కంటే పూజా పారితోషికమే ఎక్కువట. 

ఇక తాజా సమాచారం ఏంటంటే.. పూజా హెగ్డే తన పారితోషికాన్ని కోటిన్నరనుంచి ఏకంగా రెండు కోట్లకు పెంచిందట. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్లకు కరువొచ్చింది. కుర్రహీరోలకు సరిజోడీలను వెదికే పనిలో దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే పూజా, లేకపోతే రష్మిక, కుదరకపోతే కీర్తి సురేష్.. ఇలా ఒకరిద్దరు మినహా మిగతావారంతా దాదాపుగా సీనియర్ల లిస్ట్ లోకి వెళ్లిపోయారు. అందుకే పూజా హెగ్డే టాలీవుడ్ లో డిమాండ్ అండ్ సప్లై అనే సూత్రాన్ని అప్లై చేస్తోంది. ఎలాగూ బాలీవుడ్ ఆఫర్లు వస్తాయనే భరోసాతోనే తెలుగు నిర్మాతలకు షాకింగ్ ఫిగర్ చెప్పేసింది. దీంతో కొత్త సినిమాలకోసం పూజా డేట్స్ తీసుకోవాలనుకుంటున్న నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: