సినీ రాజకీయం : నానిని కాదన్నాడా లేక తప్పించారా..?

shami

నాచురల్ స్టార్ నాని హీరోగా హను రాఘవపూడి డైరక్షన్ లో వచ్చిన సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథ. ఈ సినిమాతో హను, నాని కాంబోపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఇక భలే భలే మగాడివోయ్ హిట్ తర్వాత నాని వరుసగా హిట్ కొట్టిన సినిమాల్లో కృష్ణగాడి వీర ప్రేమగాధ ఒకటి. అయితే ఈ సినిమా తర్వాత నాని, హను రాఘవపూడి కాంబోలో మరో సినిమా ఉంటుందని అన్నారు. కాని ఆ సినిమా నుండి నాని తప్పుకున్నాడు. బడ్జెట్ ఎక్కువవవుతుందని తెలిసి నానినే ఈ సినిమా నుండి తప్పుకున్నాడని అన్నారు. 

 

కాని అసలు విషయం ఏంటంటే నాని ఈ సినిమా నుండి తప్పుకోలేదు తప్పించారని అంటున్నారు. నాని ప్లేస్ లో మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ను ఈ సినిమాకు సెలెక్ట్ చేశారు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపుడి డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ఆడియెన్స్ కు షాక్ ఇచ్చారు చిత్రయూనిట్. యుద్ధంతో రాసిన ప్రేమకథ అంటూ ట్యాగ్న్ లైన్ పెట్టారు. మిలట్రీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో ముందు హీరోగా న్నానిని అనుకున్నారు. కాని నాని అయితే పాన్ ఇండియా రిలీజ్ కష్టమని భావించి దుల్కర్ సల్మాన్ ను తీసుకున్నారు.

 

మహానటి సినిమాలో జెమిని గణేషన్ పాత్రలో నటించి మెప్పించాడు దుల్కర్ సల్మాన్. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో మళయాళంలో సూపర్ హిట్టైన అతని సినిమాలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. నానితో అనుకున్న ఈ సినిమాను హను, దుల్కర్ తో చేయడానికి హీరో స్టామినా.. బిజినెస్ కు సంబందించిన లెక్కలు ఉన్నాయని తెలుస్తుంది. నాని కాదన్న ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ ఓకే చెప్పగా.. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: