ప్రయోగాలు చేయడంలో అక్కినేని కోడలు అనిపించిన సమంత ..!

Kunchala Govind

అక్కినేని ఫ్యామిలీలో అక్కినేని నాగేశ్వర రావు సినిమాల పరంగా ఎన్నో ప్రయోగాత్మకమైన సినిమాలు చేసి ఆయనకి ఆయనే సాటి అనిపించుకున్నారు. దేవదాసు, ప్రేమ నగర్, ప్రేమాభిషేకం ..లాంటి ఎన్నో సినిమాలు అందుకు ఉదాహరణ. ఆ తర్వాత జనరేషన్ లో అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా నాగార్జున ఎన్నో ప్రయోగాలు చేయడం ఆ ప్రయోగాలతో బ్లాక్ బస్టర్స్ అందుకోవడం కొత్త ట్రెండ్ ని సృష్ఠించడం మనం చూశాము. 

 

 

గీతాంజలి, క్రిమినల్, కిల్లర్ లాంటి సినిమాలతో పాటు అన్నమయ్య, శ్రీ రామదాసు, శ్రీ శిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ వంటి భక్తి ప్రధానాంశంగా తెరకెక్కిన సినిమాలలో నటించి నాగార్జున తప్ప ఇలాంటి పాత్రలు మరో హీరో చేయలేరు అనిపించుకున్నారు. ఇక కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ గా వచ్చిన మన్మధుడు, కింగ్, మాస్, సంతోషం, సూపర్, నేనున్నాను వంటి సినిమాలు నాగార్జునలోని స్టామినాని చూపించాయి. అన్నపూర్ణ స్టూడియో అధినేతగా, హీరోగా, నిర్మాతగా నాగార్జున ఇప్పటికీ సినిమాల పరంగా విభిన్నమైన కథలతో ప్రయోగాలు చేస్తూ సక్సస్ లు అందుకుంటున్నారు.

 

 

ఇక నాగార్జున వారసులు అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ కూడా అన్ని రకాల జోనర్స్ లో కథలని ఎంచుకొని సినిమాలు చేస్తూ విజయవంతంగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు అక్కినేని కోడలుగా ఈ కుటుంబంలోకి అడుగుపెట్టిన సమంత నాగార్జున లాగా ఎక్కువగా ప్రయోగాలని చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది.  ఇక అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి చేసిన పెద్ద ప్రయోగం "మనం" సినిమా. ఇలాంటి సినిమా తీయాలని చాలామంది అనుకున్నప్పటికి సాధ్యపడలేదు.

 

 

ముఖ్యంగా నాగ చైతన్యతో పెళ్ళి తర్వాత సమంత సినిమాల పరంగా చాలా వ్యత్యాసం చూపిస్తుంది. అంతకు ముందు చేసినటువంటి కమర్షియల్ సినిమాలని కాకుండా నటనకి, తన పాత్రకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది. ముఖ్యంగా మజిలీ, ఓ బేబి సినిమాలతో సమంత కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. ఈ ప్రయాణంలో పూర్తిగా వైవిధ్యభరితమైన కథలకే పూర్తి ప్రాధాన్యం ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే మొదటిసారి "ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2" సిరీస్ లో ఒక ఛాలెంజింగ్ రోల్ పోషిస్తుంది. ఎప్పుడైతే సమంత ఈ రోల్ కమిటయిందో  అందరూ సమంత ప్రయోగాలు చేయడంలో అక్కినేని కోడలు అనిపించుకుంటుందన్న ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: